ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ Lava మరొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో విడుదల చేసింది. అదే, Lava X3 మరియు దీన్ని గతంలో విడుదల చేసిన X2 కి తరువాత తరం ఫోన్ గా తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా మరియు పెద్ద బ్యాటరీతో ఇండియన్ మార్కెట్ లో లావా లాంచ్ చేసింది. చవక ధరలో వచ్చిన ఈ లావా మొబైల్ ధర, ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Lava X3: ధర
Lava X3: స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6,999 రూపాయల ధరలో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను అమెజాన్ నుండి ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ.2,999 రూపాయల విలువైన N11 Pro Buds ను ను ఉచితంగా అందిస్తుంది. ఈ అఫర్ డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్ Helio A22 చిప్ సెట్ మరియు జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 512GB వరకూ స్టోరేజ్ ను విస్తరించే సామర్ధ్యంతో వస్తుంది. ఈ ఫోన్ లస్టర్ బ్లూ, ఆర్క్టిక్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్ వంటి మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP ప్రధాన కెమెరా మరియు మరొక కెమెరా ఉన్నాయి. ముందు, 5MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 4000mAh బిగ్ బ్యాటరీని సాదారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 12 GoEdition పైన పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile