Lava Virat V1 5G టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ లీక్.!

HIGHLIGHTS

Lava Virat V1 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం లావా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది

విరాట్ వి 1 సిరీస్ నుంచి కొత్త 4జి మరియు 5జి ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ప్రైస్ మాత్రం ఆన్లైన్ లో లీకయ్యాయి

Lava Virat V1 5G టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ లీక్.!

Lava Virat V1 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం లావా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక 4G మరియు 5G స్మార్ట్ ఫోన్ లను అందించిన ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా, ఇప్పుడు విరాట్ వి 1 సిరీస్ నుంచి కొత్త 4జి మరియు 5జి ఫోన్ లను కూడా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయగా, ఈ సిరీస్ 5జి ఫోన్ యొక్క టాప్ ఫీచర్లు లావా రివీల్ చేసింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ప్రైస్ మాత్రం ఆన్లైన్ లో లీకయ్యాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Virat V1 5G : లాంచ్ డేట్ ఏమిటి?

లావా విరాట్ వి1 5జి స్మార్ట్ ఫోన్ జూలై 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్లో లాంచ్ చేయడుతుంది. ఎప్పుడూ అమెజాన్ ద్వారా మాత్రమే తన ఫోన్ లను విడుదల చేసిన లావా, ఈ కొత్త విరాట్ వి1 సిరీస్ ఫోన్ లను మాత్రం ఫ్లిప్ కార్ట్ నుంచి విడుదల చేస్తోంది.

Lava Virat V1 5G : టాప్ ఫీచర్స్

డిజైన్

లావా లాంచ్ చేయనున్న ఈ కొత్త సిరీస్ ఫోన్ ను సరికొత్త లేజర్ కట్ బ్యాక్ ప్యానల్ మరియు స్లీక్ డిజైన్ తో అందిస్తోంది. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో ఉంటుంది.

డిస్ప్లే

లావా ఈ ఫోన్ ను 6.75 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది. ఈ డిస్ప్లే HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో వస్తుంది.

పెర్ఫార్మెన్స్

లావా ఈ కొత్త ఫోన్ ను Unisoc T8200 Soc తో లాంచ్ చేస్తుంది. ఇది 6nm మరియు ఇది 4,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందించే సత్తా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో మంచి పెర్ఫార్మెన్స్ కోసం 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందిస్తుంది.

Lava Virat V1 5G top features

కెమెరా

లావా విరాట్ వి1 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 13MP Ai డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన AI కెమెరా మోడ్ మరియు మరిన్ని ఇతర కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి.

బ్యాటరీ

ఈ కొత్త ఫోన్ ను ఏకంగా 6000 mAh భారీ బ్యాటరీ బ్యాకప్ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఆపరేటింగ్ సిస్టం

ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా ఎటువంటి యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 16 తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ సర్వీస్ ను ఆఫర్ చేస్తుంది.

లావా విరాట్ వి 1 : అంచనా ధర ఏమిటి?

లావా విరాట్ వి 1 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఫోన్ రూ. 12,999 నుంచి 14,999 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది అఫీషియల్ స్టేట్మెంట్ కాదని మీరు గమనించాలి. ఇది కేవలం అంచనా ప్రైస్ మాత్రమే.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile