Lava Storm 5G: భారీ లాంచ్ ఆఫర్ తో విడుదలైన లావా ఫోన్ |Tech news

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్ లో Lava Storm 5G స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యబడింది

ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్లు మరియు భారీ లాంచ్ ఆఫర్ తో లావా విడుదల చేసింది

ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ మరియు లాంచ్ ఆఫర్ తో విడుదల చేసింది లావా

Lava Storm 5G: భారీ లాంచ్ ఆఫర్ తో విడుదలైన లావా ఫోన్ |Tech news

ఈరోజు ఇండియన్ మార్కెట్ లో Lava Storm 5G స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్లు మరియు భారీ లాంచ్ ఆఫర్ తో లావా విడుదల చేసింది. ఈ ఫోన్ లేటెస్ట్ బడ్జెట్ 5జి ప్రోసెసర్, బిగ్ ర్యామ్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ మరియు లాంచ్ ఆఫర్ తో విడుదల చేసింది లావా. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Strom 5G Price

Lava Storm 5G Price and offers
లావా స్ట్రోమ్ 5జి ఫోన్

లావా స్ట్రోమ్ 5జి ఫోన్ ను కేవలం 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో MRP Rs. 14,999 ధరతో లాంచ్ చేసింది. అమేజాన్ ఈ ఫోన్ ను రూ. 13,499 రూపాయల స్పెషల్ ప్రైస్ తో లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.

ఈ అన్ని ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ధరకే అందుకోవచ్చని అమేజాన్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read : Jio జబర్దస్త్ ఆఫర్: రూ. 148 రూపాయలకే 12 OTT సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్ లాంచ్.!

లావా స్ట్రోమ్ స్పెక్స్ & ఫీచర్స్

లావా స్ట్రోమ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ మరియు కొత్త కెమేరా మోడ్యూల్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ ను 6.78 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది . ఈ ఫోన్ ను 16MP పంచ్ హోల్ కెమేరాని కలిగి వుంది. ఈ లావా ఫోన్ ను మీడియాటెక్ Dimesnity 6080 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ భారీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది.

Lava Storm 5G features
లావా స్ట్రోమ్ స్పెక్స్ & ఫీచర్స్

లావా స్ట్రోమ్ లో వెనుక 50MP + 8MP డ్యూయల్ కెమేరాని LED ఫ్లాష్ లైట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ గేల్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ టైప్ C పోర్ట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile