Lava Bold N1 5G : బడ్జెట్ సిరీస్ నుంచి ప్రీమియం డిజైన్ ఫోన్ వస్తోంది..!

HIGHLIGHTS

లావా బడ్జెట్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ ఎన్1 5 జి ఫోన్ లాంచ్ అవుతోంది

Lava Bold N1 5G ప్రీమియం ఫోన్స్ లో ఉండే గ్లాసీ బ్లాక్ డిజైన్ కలిగి ఉంటుంది

ఈ ఫోన్ 4 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే Unisoc T765 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది

Lava Bold N1 5G : బడ్జెట్ సిరీస్ నుంచి ప్రీమియం డిజైన్ ఫోన్ వస్తోంది..!

Lava Bold N1 5G: లావా బడ్జెట్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ ఎన్1 5 జి ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ అయినా కూడా ప్రీమియం ఫోన్స్ లో ఉండే గ్లాసీ బ్లాక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావటానికి రెడీగా ఉంది. ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold N1 5G : ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఈ లావా స్మార్ట్ ఫోన్ మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా లావా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు కూడా విడుదల చేశారు.

Lava Bold N1 5G : ఫీచర్స్

లావా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం గ్లాసీ బ్యాక్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ ప్రీమియం ఫోన్ ను తలపిస్తోంది. ఈ ఫోన్ 4 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే Unisoc T765 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4 జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Lava Bold N1 5G

ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఇదే కాదు టైప్ C ఛార్జ్ పోర్ట్ కూడా ఉంటుంది. అంటే, వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కూడా ఇందులో వుండే అవకాశం ఉండవచ్చు.

Also Read: సేల్ ముగిసినా ఆగని ఆఫర్లు.. చవక ధరలో డ్యుయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ అందుకోండి.!

ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రాయల్ బ్లూ మరియు కెంపగనే గోల్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ లావా ఫోన్ బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 15OS తో లాంచ్ అవుతుంది. ఇందులో ఫేస్ అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ ను లావా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile