సేల్ ముగిసినా ఆగని ఆఫర్లు.. చవక ధరలో డ్యుయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

నిన్నటితో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ బిగ్ సమ్మర్ సేల్స్ ముగిసాయి

ఫ్లిప్ కార్ట్ ఈరోజు కూడా జబర్దస్త్ సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో డ్యుయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు

సేల్ ముగిసినా ఆగని ఆఫర్లు.. చవక ధరలో డ్యుయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ అందుకోండి.!

నిన్నటితో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ బిగ్ సమ్మర్ సేల్స్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు కూడా జబర్దస్త్ సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.ఈ డీల్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే సేల్ ముగిసిన తర్వాత కూడా ఆఫర్ల వర్షం ఇంకా ఆగలేదు. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో డ్యుయల్ ఉఫర్ Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby సౌండ్ బార్ : ఆఫర్

నిన్ననే ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ SASA LELE ముగిసింది. అయితే, సేల్ ముగిసిన తర్వాత ఈ రోజు కూడా భారీ డీల్స్ అండ్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈరోజు అందించిన బిగ్ డీల్స్ లో డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే లేటెస్ట్ సౌండ్ బార్ ఆఫర్ అమితంగా ఆకట్టుకుంటుంది.

Dolby soundbar deal

అదేమిటంటే, GoVo లేటెస్ట్ సౌండ్ బార్ GO SURROUND 888 ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు 81% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ నిజానికి రూ. 12,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది మరియు ఈ రోజు రూ. 5,000 తగ్గింపు ధరలో లభిస్తుంది.

Also Read: రేపు విడుదలయ్యే Moto G37 మరియు G37 Power ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

GoVo Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ గోవో సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, శాటిలైట్ స్పీకర్ లారియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ అడ్వాన్స్డ్ స్పీకర్లు కలిగి మంచి సినిమాటిక్ సౌండ్ అందిస్తుందని గోవో తెలిపింది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి సినిమాటిక్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మల్టీ ఫంక్షన్ కంట్రోల్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ సౌండ్ బార్ 35 – 200 Hz ఫ్రీక్వెన్సీ తో మంచి డెప్త్ ఉన్న బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మిశ్రమ రివ్యూలు అందుకుంది మరియు కేవలం 3.5 స్టార్ రేటింగ్ మాత్రమే కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile