LAVA Bold N2 Pro: 50MP ట్రిపుల్ కెమెరా మరియు బిగ్ స్టోరేజ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
లావా తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ ఎన్ 2 ప్రో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరా మరియు బిగ్ స్టోరేజ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ అరోరా గోల్డ్ మరియు ఎక్లిప్స్ గ్రే రెండు రంగుల్లో లభిస్తుంది.
LAVA Bold N2 Pro: లావా తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ ఎన్ 2 ప్రో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 50MP ట్రిపుల్ కెమెరా మరియు బిగ్ స్టోరేజ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అందించిన లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ను కొత్తగా ఈ లిస్ట్ లో జత చేసింది.
SurveyLAVA Bold N2 Pro: ప్రైస్
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్లో సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ అరోరా గోల్డ్ మరియు ఎక్లిప్స్ గ్రే రెండు రంగుళ్ళూ లభిస్తుంది.
LAVA Bold N2 Pro: ఫీచర్స్
లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్లీక్ డిజైన్ మరియు 201 గ్రాముల బరువుతో మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ లావా లేటెస్ట్ ఫోన్ Unisoc T7250 ఆక్టాకోర్ చిప్ సెట్, 4 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ లావా ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mah బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ IP రేటింగ్ విషయానికి వస్తే, లావా బోల్డ్ ఎన్ 2 ప్రో IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: TCL 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా లావా ఉచిత హోమ్ సర్వీస్ తో వస్తుంది. ఈ లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చవక ధరలో స్లీక్ డిజైన్, స్టన్నింగ్ కెమెరా, బిగ్ బ్యాటరీ మరియు వాటర్ రెసిస్టెంట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ లో లాంచ్ అయినట్లు మనం చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile