Lava Bold N2 launch teased in India
Lava Bold N2: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా తాన్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ విడుదల చేసింది. లావా బడ్జెట్ సిరీస్ అయిన బోల్డ్ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, లావా బోల్డ్ ఎన్ 2 మరియు ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ లావా ఫోన్ అంచనా స్పెక్స్ మరియు లాంచ్ వివరాలు చూద్దామా.
లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది. లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వివరాలు ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ తెలిసేలా టీజర్ ఇమేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చే వారాంతాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇది కంపెనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కచ్చితమైన డేట్ గురించి తెలియదు.
ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఈ డ్యూయల్ రియర్ కెమెరా లో 13MP మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అడుగు భాగంలో టైప్ C ఛార్జ్ పోర్ట్, స్పీకర్ మరియు 3.5 జాక్ ఉంటాయి. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.
Also Read: అమెజాన్ భారీ డిస్కౌంట్ తో డ్యూయల్ ఉఫర్ 5.2 Dolby Soundbar అతి చవక ధరలో లభిస్తోంది.!
ఈ అప్ కమింగ్ లావా స్మార్ట్ ఫోన్ Unisoc 9863A వంటి యునిసోక్ బడ్జెట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. ఇది కాకుండా బిగ్ HD+ స్క్రీన్, 4GB ర్యామ్ మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ ఉండవచ్చు. ఈ ఫోన్ సిల్వర్ మరియు బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఇక ఈ ఫోన్ అంచనా ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ అండర్ రూ. 8,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.