Lava Bold N1 : లావా లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లావా బోల్డ్ N1 మరియు N1 Pro రెండు ఫోన్లు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ ను 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో లావా లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్స్ ధర మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Lava Bold N1 : ప్రైస్
లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ రూ. 5,999 ధరతో మరియు బోల్డ్ ఎన్ 1 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 6,799 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ రెండు ఫోన్లు కూడా ఈరోజు నుంచి అమెజాన్ మరియు లావా వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ఈ ఫోన్స్ పై మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లను Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్స్ మరింత చవక ధరలో లభిస్తాయి.
లావా బోల్డ్ ఎన్ 1 మరియు ఎన్ 1 ప్రో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 6.67 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటాయి. వీటిలో ఎన్ 1 ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ తో మరియు ఎన్ 1 ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా Unisoc ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తాయి. వీటిలో ఎన్ 1 ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటే, ఎన్ 1 ప్రో 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కూడా వర్చువల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటాయి.
కెమెరా పరంగా, లవ్ బోల్డ్ ఎన్ 1 ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ మరియు బోల్డ్ ఎన్ 1 ప్రో ఫోన్ మాత్రం 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఎన్ 1 ఫోన్ 5MP సెల్ఫీ కెమెరా మరియు ఎన్ 1 ప్రో మాత్రం 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు ఫోన్లు కూడా IP 54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటాయి.