లావా ఈసారి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Lava Blaze Curve భారీ ఫీచర్స్ తో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంఛ్ కోసం చేస్తున్న టీజింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ప్రైస్ తప్ప దాదాపుగా అన్ని వివరాలను బయట పెట్టేసింది. ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకూ కంపెనీ బయట పెట్టిన వివరాల ప్రకారం LPDDR5 RAM మరియు UFS 3.1 వంటి భారీ ఫీచర్స్ తో వస్తున్నట్లు అర్ధమవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Lava Blaze Curve
లావా బ్లేజ్ కర్వ్ యొక్క డిజైన్, డిస్ప్లే, కెమేరా మరియు ర్యామ్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ వివరాల ద్వారా ఈ ఫోన్ సామర్ధ్యాన్ని అంచనా వేసేలా చేసింది. లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ 5 March 2024 మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్య ద్వీప్ ఐల్యాడ్ నుండి లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
ఈ ఫోన్ ను MediaTek Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తోంది. అంతేకాదు, ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించే LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ లను ఈ ఫోన్ ఉపయోగించినట్లు లావా కన్ఫర్మ్ చేసింది. ఇది సాధారణ LPDDR4X కన్నా మరింత వేగంగా యాప్స్ ను ఓపెన్ చేస్తుందని కూడా తెలిపింది.
Lava Blaze Curve LPDDR5 RAM
అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు Dolby Atmos సపోర్ట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో 64MP Sony సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.