Lava Blaze 5G Sale: సేల్ కి అందుబాటులోకి రానున్న బడ్జెట్ 5G ఫోన్.!

HIGHLIGHTS

Lava Blaze 5G సేల్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ

అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన లావా

10,000 రూపాయల ధరలో ఈ ఫోన్ రేటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు

Lava Blaze 5G Sale: సేల్ కి అందుబాటులోకి రానున్న బడ్జెట్ 5G ఫోన్.!

ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 నుండి ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ను ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ముందుగా, దీపావళి నాటికి లావా బ్లేజ్ ధర మరియు సేల్ వివరాలు బయటకి రావచ్చని అంచనా వేశారు. కానీ, కంపెనీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. అయితే, ఎట్టకేలకు లావా తన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ నవంబర్ 3 నుండి అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది.

 Lava Blaze 5G: ధర

వాస్తవానికి, ప్రస్తుతానికి ఈ లావా బ్లేజ్ 5G ఫోన్ ధర పైన క్లారిటీ లేదు. అయితే, ఈ ఫోన్ ను భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకొని వస్తోంది కాబట్టి, సుమారు 10,000 రూపాయల ధరలో ఈ ఫోన్ రేటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile