12 వేల లోపలే 6GB ర్యామ్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 18 Mar 2023 12:44 IST
HIGHLIGHTS
  • 12 వేల లోపలే 6GB ర్యామ్ 5G ఫోన్

  • మంచి డీల్ మీకోసం అందుబాటులో వుంది

  • ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు అమెజాన్ నుండి కొనుగోలు చెయవచ్చు

12 వేల లోపలే 6GB ర్యామ్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!
12 వేల లోపలే 6GB ర్యామ్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

12 వేల లోపలే 6GB ర్యామ్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మంచి డీల్ మీకోసం అందుబాటులో వుంది. ఇండియాలో లావా విడుదల చేసిన లేటెస్ట్  5G స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G యొక్క 6GB ర్యామ్ ఇప్పుడు చాలా చవక ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు అమెజాన్ నుండి కొనుగోలు చెయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన  కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు.   

Lava Blaze 5G: ధర

Lava Blaze 5G బేసిక్ వేరియంట్ ను రూ.10,499 ధరతో లభిస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ ధర. అయితే, 6GB ర్యామ్ మరియు 128GB మాత్రం కేవలం రూ.11,499 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.   

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ బ్యాండ్ 5G లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. 

మరిన్ని టెక్నాలజీ న్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్, సైన్స్-టెక్ ఫీచర్లు మరియు అప్డేట్స్ కోసం Digit.in లేదా మా గూగుల్ న్యూస్ పేజ్ ను సందర్శించండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

lava blaze 5g new 6gb variant now available

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

Advertisements

VISUAL STORY మొత్తం చూపించు