ఈసారి Lava మొబైల్ Agni 2 5G తో చైనా మొబైల్ కంపెనీలు పోటీ ఇస్తుందా.!

HIGHLIGHTS

దేశీయ మొబైల్ కంపెనీ Lava నుండి వస్తున్నా ప్రీమియం ఫోన్

ఈసారి Lava మొబైల్ Agni 2 5G తో చైనా మొబైల్ కంపెనీలు పోటీ

Dimensity 7050 SoC తో ఇండియాలో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్

ఈసారి Lava మొబైల్ Agni 2 5G తో చైనా మొబైల్ కంపెనీలు పోటీ ఇస్తుందా.!

దేశీయ మొబైల్ కంపెనీ Lava ఇండియాలో ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు కనిపిస్తోంది. ఇండియాలో త్వరలోనే Lava Agni 2 5G  స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజ్డ్ స్పెక్స్ చూస్తుంటే, ఈసారి Lava మొబైల్ Agni 2 5G తో చైనా మొబైల్ కంపెనీలు పోటీ ఇస్తుందా? అని అనిపిస్తోంది. ఇంతగా ఆకట్టుకుంటున్న ఈ లావా అప్ కమింగ్ ఫోన్ వివరాలేమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Agni 2 5G:

లావా మొబైల్స్ యొక్క ఈ అప్ కమింగ్ 5G ఫోన్ యొక్క వివరాలను ఒకొక్కటిగా కంపెనీ బయటపెడుతూ టీజింగ్ చేస్తోంది. ముందుగా, ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో రాబోతున్నట్లు తెలిపిన కంపెనీ, తరువాత ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 7050 SoC తో ఇండియాలో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ ఇదే అని ప్రకటించి ఈ ఫోన్ పైన అంచనాలను మరింతగా పెంచింది. 

ఇక ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఈ ఫోన్ యొక్క గ్లింప్స్ ఇమేజ్ ను అందించి మరింత ఆకట్టుకుంది. ఈరోజు రిలీజ్ చేసిన ఇమేజి ద్వారా ఈ ఫోన్ కలర్ వేరియంట్ తో వెనుక పెద్ద కెమేరా మాడ్యూల్ మరియు చాలా ప్రీమియం లుక్ తో రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ ధర విషయం పక్కన పెడితే, భారతీయ మొబైల్ కంపెనీ నుండి వస్తున్న మొదటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇదే కావచ్చని అనిపిస్తోంది. 

అయితే, ఇదంతా కూడా మనం అంచనా వేసి చెబుతూన్న విషయాలు మాత్రమే, ఈ ఫోన్ లాంచ్ కావడానికి మరింత సమయం వుంది కాబట్టి మరిన్ని ఫీచర్లను కంపెనీ తన టీజింగ్ ద్వారా వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo