200MP కెమేరాతో వచ్చిన టాప్ స్మార్ట్ ఫోన్స్ పైన లుక్కేద్దామా.!
మీరు హెవీ కెమేరా లవర్ అయితే ప్రస్తుతం మార్కెట్ లో చాలా అప్షన్ లు మీకు అంధుబాటులో ఉన్నాయి
అన్ని కంపెనీలు కూడా పోటీ పడి మరీ కెమేరా నెంబర్లను పెంచుకుంటూ వచ్చాయి
ఇప్పుడు మార్కెట్ లో 200MP కెమేరా ట్రెండ్ నడుస్తోంది మరియు ఇదే ప్రస్తుత హైఎస్ట్ నెంబర్ కెమేరా గా నిలిచింది
మీరు హెవీ కెమేరా లవర్ అయితే ప్రస్తుతం మార్కెట్ లో చాలా అప్షన్ లు మీకు అంధుబాటులో ఉన్నాయి. 48 MP కెమేరాతో వచ్చిన ఫోన్లను ఎక్కువ ప్రాచుర్యాన్ని సంతరించుకోవడంతో అన్ని కంపెనీలు కూడా పోటీ పడి మరీ కెమేరా నెంబర్లను పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ లో 200MP కెమేరా ట్రెండ్ నడుస్తోంది మరియు ఇదే ప్రస్తుత హైఎస్ట్ నెంబర్ కెమేరా గా నిలిచింది. మరి ఈ 200MP కెమేరా తో వచ్చిన టాప్ స్మార్ట్ ఫోన్స్ పైన లుక్కేద్దామా.
SurveyRealme 11 Pro+ 5G
ధర రూ. 27,999
నిన్ననే ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ 200MP OIS ట్రిపుల్ కెమేరా సెటప్ ని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Curved డిస్ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 mAh బిగ్ బ్యాటరీ, Dolby Atmos సౌండ్ సపోర్ట్ లను కలిగి వుంది. ఇది 8GB ర్యామ్, 256 స్టోరేజ్ తో Dimensity 7050 SoC తో వస్తుంది.
Redmi Note 12 Pro+
ధర రూ. 29,999
ఈ రెడ్ మి స్మార్ట్ ఫోన్ 200MP (Samsung HPX ) ట్రిపుల్ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 8100 ప్రోసెసర్, బిగ్ Pro AMOLED ని HDR 10+ మరియు డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-Res సర్టిఫికేషన్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా కలిగి వుంది.
Infinix Zero Ultra
ధర రూ. 29,999
ఇన్ఫినిక్స్ ఇండియాలో విడుదల చేసిన Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ కూడా 200MP OIS ట్రిపుల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz 3D Curved AMOLED డిస్ప్లేని, 180W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని,Dimnsity 920 చిప్ సెట్, 13GB వరకూ మెమొరీ ఫ్యూజన్ ర్యామ్ సపోర్ట్, ఫాస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, DTS సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు వంటి భారీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి వుంది.
MOTOROLA Edge 30 Ultra
ధర రూ. 29,999
మోటోరోలా ఇండియాలో హెవీ కెమేరా సెటప్ తో అందించిన స్మార్ట్ ఫోన్ ఇది. ఈ మోటో ఫోన్ 200 (OIS) + 50MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో + 12MP పోర్ట్రైట్ కెమేరా సెటప్ ని భారీ ఫీచర్లతో కలిగి వుంది మరియు 60MP సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కెమేరాతో 8K వీడియో లను 30fps వద్ద 4K వీడియో లను 30fps / 60fps వద్ద రికార్డ్ చెయ్యవచ్చు. ఈ మోటో ఫోన్ 144Hz FHD+ pOLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రోసెసర్, 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు వంటి భారీ ఫీచర్లు ఈ మోటో ఫోన్ కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile