జియో సంచలనం: 10 వేలకే 5G ఫోన్ తీసుకువచ్చే ఆలోచనలో జియో

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jan 2022
HIGHLIGHTS
  • JioPhone 5G కోసం పనిచేస్తున్న జియో

  • 10 వేల రూపాయల ధర పరిధిలో తీసుకురావచ్చని కూడా తెలుస్తోంది

  • ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉండవచ్చు

జియో సంచలనం: 10 వేలకే 5G ఫోన్ తీసుకువచ్చే ఆలోచనలో జియో
జియో సంచలనం: 10 వేలకే 5G ఫోన్ తీసుకువచ్చే ఆలోచనలో జియో

రిలయన్స్  జియో  ఇండియాలో జియో తన 5g సర్వీస్ తో పాటుగా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Jio Phone 5G తీసుకురావడానికి కూడా పనిచేస్తున్నట్లు ఒక రిపోర్ట్ ద్వారా వెల్లడయ్యింది. అంతేకాదు, జియో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గా చెబుతున్న JioPhone 5G ని భారతీయ బడ్జెట్ సెగ్మెంట్ ను దృష్టిలో ఉంచుకొని కేవలం  10 వేల రూపాయల ధర పరిధిలో తీసుకురావచ్చని కూడా తెలుస్తోంది. ఇదే ఆకానుక నిజమైతే ప్రస్తుతం 16 వేల సబ్ కేటగిరికే పరిమితమైన 5G స్మార్ట్ ఫోన్, మరింత చవక ధరకే లభిస్తుంది.

రిపోర్ట్ ప్రకారం, జియో 5G సర్వీస్ ప్రకటించే సమయానికి బడ్జెట్ ధరలో JioPhone 5G ని కూడా ప్రకటించవచ్చు. అంతేకాదు, ఈ 5G ఫోన్ యొక్క స్పెక్స్ ను కూడా ఈ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ చాలానే లభిస్తున్నా కూడా అవన్నీ కూడా 15 వేల కంటే ఎక్కువ ధరలో ఉండగా, జియో మాత్రం JioPhone 5G అందరికి అందుబాటులో రూ.9,000 నుండి రూ.12,000 మధ్యలో ఉంచవచ్చని కూడా ఈ రిపోర్ట్ తెలిపింది.

జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుందని నివేదిక చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చని మరియు కెమెరాల పరంగా పెద్ద మార్పులు లేకపోవచ్చని ఈ నివేదిక వెల్లడించింది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jiophone 5g may come as cheapest 5g phone in india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
₹ 13499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status