జియోఫోన్ 2 ప్రీ – బుకింగ్ ఆగష్టు15 న మొదలుకానుంది : ఎలా బుక్ చేయాలి ,ఎంత ధర,ఫోన్ అందుబాటు మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం

జియోఫోన్ 2 ప్రీ – బుకింగ్ ఆగష్టు15 న మొదలుకానుంది  : ఎలా బుక్ చేయాలి ,ఎంత ధర,ఫోన్ అందుబాటు మరియు మీకు కావాల్సిన మొత్తం సమాచారం
HIGHLIGHTS

జియోఫోన్ 2 పూర్తి క్వర్టీ(QWERTY) కీబోర్డ్ లేఅవుట్ తో వస్తుంది అయితే ఇది మొదటి జియోఫోన్ కంటే ఎక్కువ ధరగా ఉండనుంది. ఆగష్టు 15 న అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ డివైజ్ ని ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ మీకోసం అందించాము.

రిలయన్స్ జీయో తన  ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో జియోఫోన్ తో స్వీట్ స్పాట్ ని సాధించింది, ఇది ప్రస్తుతం దేశంలో 25 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. రిలయన్స్ జీయో  విజేతగా నిలిచిన తన స్మార్ట్ ఫీచర్ ఫోన్ కి వారసుడిగా  జీయోఫోన్ 2 ని  విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి ప్రీ బుకింగ్ కోసం ఇది అందుబాటులో ఉంటుంది.  జీయోఫోన్ యొక్క సరళత మరియు విజయన్ని లక్ష్యంగా నిర్మించిన జియోఫోన్ 2, మెరుగైన కార్యాచరణను అందిస్తుంది. 9 కీ నెంబర్ ప్యాడ్ కు బదులుగా, కొత్త జియోఫోన్ 2 పూర్తి QWERTY కీబోర్డు లే అవుట్ తో లభిస్తుంది, అయితే దీని ధర ధర రూ. 2,999 గా ఉంటుంది.

జియోఫోన్ 2 ఎలా  చేయాలి

పైన తెలిపిన విధంగా, డివైజ్ యొక్క రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 15 నుండి మొదలవుతుంది మరియు మై జియో యాప్ నుండి లేదా సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ Jio.com ద్వారా డివైజ్ బుక్ చేసికోవచ్చు. జియోఫోన్ బుకింగ్ వలె, జియోఫోన్ 2 బుకింగ్ కూడా అనే  బ్యానర్ ఉంటుంది, దీనిని నొక్కడం తో  పేరు, చిరునామా, మరియు సంప్రదింపు సంఖ్య వంటి వారి వ్యక్తిగత వివరాలను అందిచడం కోసం ఒక వెబ్ పేజీకి   అది వినియోగదారులు మళ్ళిస్తుంది.

కాష్ ఆన్ డెలివరీ (COD) సదుపాయం ఉండదు కనుక జియోఫోన్ 2 ఆన్లైన్ చెల్లింపు ఎంపికలను ఉపయోగించి మాత్రమే కొనుగోలు చేయగలరని  నివేదికలు చెబుతున్నాయి. బుక్ చేసిన యూనిట్ డెలివర్ కి సంభందించి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, జియోఫోన్ 2 కి డబ్బు చెల్లించిన తర్వాత కొద్దిరోజులకే డెలివరీ చేయవచ్చని వదంతులు సూచిస్తున్నాయి.

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్

జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది, ఇది పాత బ్లాక్ బెర్రీ ఫోన్లను మనకు గుర్తుకు  తెస్తుంది.  పరికరం క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. ఫోన్ 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు వోల్టి(voLTE)  కు మద్దతు ఇస్తుంది, అయితే, ఇది VoWiFi కు మద్దతు ఇస్తుంది మరియు మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టికాస్ట్ సర్వీస్ (eMBMS) ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఫోన్ NFC, Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ తక్కువ శక్తికి కూడా మద్దతు ఇస్తుంది మరియు దీనిలో FM రేడియో అంతర్నిర్మితంగా ఉంటుంది.

AGM వద్ద, జియోఫోన్ 2 లో నడపనున్న  ప్రాసెసర్నుఇంకా బహిర్గతం చేయలేదు, కానీ ముందున్నఫోన్ తో పోలిస్తే అతి తక్కువ హార్డ్వేర్ మార్పులు ఉన్నట్లు అనిపిస్తుంది, అది స్ప్రెడ్ట్రమ్ SP9820A లేదా క్వాల్కమ్ 205 మొబైల్ ప్లాట్ఫారమ్ (MSM8905) చేత శక్తినివ్వగలదు. జియోఫోన్ 2  వెనుక భాగంలో 2ఎంపీ కెమెరా కలిగి ఉంది మరియు ముందు ఒక VGA సెన్సార్ ఉంది. ఒక 2000mAh బ్యాటరీ డివైజ్ కి మద్దతు ఇస్తుంది.

జియోఫోన్ 2 ఫీచర్స్

జియోఫోన్ లో కనిపించే ప్రతి ఫీచర్ కి జియోఫోన్ 2 మద్దతివ్వనుంది. అదనంగా, ఆగస్టు 15 నుండి, వాట్సాప్, పేస్ బుక్ మరియు యుట్యూబ్  జియోఫోన్ లో డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంటాయి. కాబట్టి, జియోఫోన్ 2 వస్తూనే ఒకేసారి మూడు యాప్స్ కోసం మద్దతు ఇవ్వడానికి సిద్ఘంగా ఉంటుంది. AGM వద్ద, రిలయన్స్ జీయో యాప్స్ బూటింగ్ చేయడానికి మరియు యుట్యూబ్ లో వీడియోలను  వెతకడం కోసం వాయిస్ కమాండును కూడా ఉపయోగించుకోవచ్చని తెలియపరిచారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo