Nothing Phone 4a ఫోన్ పై పరదా తీసిన నథింగ్.. ఫోన్ ఎలా ఉందంటే.!
Nothing Phone 4a స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ విడుదల చేసిన నథింగ్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది
గత సిరీస్ నుంచి అందించిన ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది
Nothing Phone 4a స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి టీజర్ విడుదల చేసిన నథింగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ ను కూడా గోప్యంగా ఉంచిన కంపెనీ, లాంచ్ డేట్ దగ్గర పడటంతో ఈ ఫోన్ పియా పరాదా తొలగించి ఈ ఫోన్ పూర్తి డిజైన్ ను రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyNothing Phone 4a : లాంచ్
నథింగ్ ఫోన్ 4a స్మార్ట్ ఫోన్ 2026 మార్చి 5వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు టైం వివరాలు నథింగ్ అనౌన్స్ చేసింది. కంపెనీ అఫీషియల్ X అకౌంట్ మరియు ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు వెల్లడించింది.
Nothing Phone 4a : డిజైన్ అండ్ ఫీచర్స్
గత సిరీస్ నుంచి అందించిన ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ కూడా నథింగ్ ఫోన్ సిగ్నేచర్ స్టైల్ అయిన పారదర్శక బ్యాక్ ప్యానల్ తో ఉంటుంది. అయితే, ఈసారి జిఫ్ లైట్ ను కెమెరా చుట్టూ అందించింది మరియు సింపుల్ డిజైన్ తో ఉండేలా చూసింది. కానీ, ఈ ఫోన్ లో 9 విడివిడిగా కంట్రోల్ చేసే అవకాశం ఉన్న 9 మినీ LED లు ఉన్నాయి. ఇది గత సిరీస్ ఫోన్స్ కంటే 40 శాతం ప్రకాశవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, రౌండ్ కార్నర్, స్లీక్ డిజైన్ మరియు AI కోసం ప్రత్యేకమైన బటన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా నథింగ్ అనౌన్స్ చేసింది. ఇవి కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్ గురించి వెల్లడించిన ఫీచర్స్. అయితే, ఈ ఫోన్ పై వచ్చిన లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ ఈ ఫోన్ గురించి పూర్తిగా చెబుతున్నాయి.
Also Read: Xiaomi 17 Ultra : షియోమీ ప్రీమియం ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!
నథింగ్ ఫోన్ 4a: అంచనా ఫీచర్స్
ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని లీక్స్ చెబుతున్నాయి. ఇది తక్కువ ధరలో మంచి పెర్ఫార్మెన్స్, న్యూ డిజైన్, డెడికేటెడ్ Glyph UI లైట్ ఎఫెక్ట్స్‌తో ఆకర్షణగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 7s Gen 4 చిప్ తో లాంచ్ చేస్తుందని లీక్స్ చెబుతున్నాయి.
ఇందులో 50 MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 50W ఫఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని లీక్స్ మరియు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile