ఈ సారి Jio Phone 2 యొక్క ఫ్లాష్ సేల్ ఒక గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్ తో వస్తోంది

HIGHLIGHTS

Jio Phone 2 మరొక ఫ్లాష్ సేల్ సెప్టెంబరు 27 వ తేదీ 12 PM కి : ఇప్పుడు Paytm ద్వారా 200 రూపాయల క్యాష్ బ్యాక్

ఈ సారి Jio Phone 2 యొక్క ఫ్లాష్ సేల్ ఒక గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్ తో వస్తోంది

 అత్యధికంగా అమ్ముడవుతున్న Jio Phone 2 ఒక్క మరొక ఫ్లాష్ సేల్ ఇప్పుడు సెప్టెంబరు 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలుకానుంది. ఈ సారి Jio Phone 2 యొక్క ఫ్లాష్ సేల్ ఒక గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్ తో వస్తోంది. ఈ సేల్లో ఇప్పుడు Paytm ద్వారా 200 రూపాయల క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ ని కొనడానికి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు  jio.com మరియు myjio యాప్ ద్వారా కొనుక్కోవచ్చు. జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో ఫోన్ 2 డేటా ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి మూడు పథకాలతో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ . 49 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. ఇంకా  రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది.

చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటు

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

 జియోఫోన్ 2  క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ డివైజ్లో 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile