ఈరోజు జరగనున్న 42 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (RIL AGM) లో ఒక పెద్ద టచ్చ్ స్క్రీన్ తో కూడిన జియోఫోన్ 3 ని మార్కెట్లోకి తీసుకురావచ్చని, నివేదికల ద్వారా తెలుస్తోంది.
ప్రతి ఒక్కరికి 4G సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, తన జియో ఫోన్నుచాల తక్కువ ధరలో 4G తో విడుదల చేసి, జియో తన సత్తా చాటుకుంది. ఆ తరువాత, QWERTY కీబోర్డుతో ఒక ఫీచరు ఫోన్ను అతితక్కువ ధరతో తీసుకొచ్చి మరొకసారి తనకు ఎవరు సాటిరారని నిరూపించుకుంది. ప్రస్తుతం, ఈరోజు జరగనున్న 42 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (RIL AGM) లో ఒక పెద్ద టచ్చ్ స్క్రీన్ తో కూడిన ఒక ఫోన్ను, జియోఫోన్ 3 గా మార్కెట్లోకి తీసుకురావచ్చని, ప్రస్తుతం వస్తున్న నివేదికల ద్వారా తెలుస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
జియో ఫోన్3 స్పెసిఫికేషన్స్ (రూమర్లలో ఉన్న స్పెక్స్)
కొన్ని నివేదికలలో తెలిపిన ప్రకారం, ఈ సంస్థ జియో ఫోన్ను ఒక 5- అంగుళాల టచ్చ్ స్క్రీన్ డిస్ప్లేతో ప్రకటించనున్నదని తెలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చెప్పినదంతా నిజంగా జరిగితే, ముందుగా వచ్చిన 2.4 ఇంచ్ స్క్రీన్ మరియు 4GB స్టోరేజి నుండి ఒక్కసరిగా గణనీయమైన మార్పుకు జియో నాంది పలకనునట్లు చెప్పుకోవచ్చు. అలాగే, ముందుగా వచ్చిన జియో ఫోన్ల వలెనే మెమోరిని పెంచుకునేవేలును కూడా కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక కెమేరాల పరంగా కూడా ఇది బాగానే ఉండవచ్చని అర్ధమవుతుంది. ఇది ఒక 5MP వెనుక కెమెరా మరియు ముందు 2MP సెల్ఫీ కెమేరాతో తో ఉండవచ్చు. అయితే, దీని OS గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, KaiOS పూర్తి ప్రధాన వెర్షన్ లేదా గూగుల్ యొక్క తేలిక పాటి వెర్షన్ అయినటువంటి Android Go OS ఉండవచ్చని అంచనావేస్తున్నారు.
జియోఫోన్ 3 అంచనా ధర మరియు అందుబాటు
ఈ నివేదిక ప్రకారం, ఒకవేళ ఈ జియోఫోన్ పైన తెలిపిన అప్డేట్స్ తో కనుక వచ్చినట్లయితే, ఇది 1500 మరియు 2999 ధరలతో వరుసగా విడుదలైనటువంటి జియోఫోన్ మరియు జియోఫోన్2 కంటే ఎక్కువ ధరతో ఉండవచ్చు. ఈ జియోఫోన్ 3 రూ.4,500 ధరతో ఉండవచ్చని అంచనా మరియు ముందు ఫోన్ల మాదిరిగానే ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.
ఇక సేల్ విషయానికి వస్తే, ఈ జియోఫోన్3 అతిత్వరలోనే ప్రీ ఆర్డర్ల కోసం రావచ్చని, వీటి యొక్క సేల్ కూడా వెనువెంటనే ప్రారంభంకావచ్చని అంచనాలను వేస్తున్నారు.