కేవలం రూ.3,999 ధరలో GOOGLE Lens తో ఫోన్ లాంచ్ చేసిన itel

HIGHLIGHTS

Android 9 Pie (Go Edition) OS తో లాంచ్ చేశారు.

కేవలం రూ.3,999 ధరలో GOOGLE Lens తో ఫోన్ లాంచ్ చేసిన itel

itel సంస్థ, కేవలం రూ.3,999 రుపాయల ధరలో మంచి స్పెక్స్ తో, తన A25 మొబైల్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, కేవలం రూ. 3,999 ధరలో పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో విడుదలయ్యింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుండి భారతదేశమంతటా ఆఫ్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, ఈ మొబైల్ ఫోన్ "Google Lens" కలిగి ఉంటుంది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Itel A25 ధర

Itel A25 – 1GB + 16GB – ధర : Rs.3,999

Itel A25 : ప్రత్యేకతలు

ఈ Itel A25 ఫోన్, ఒక 5- అంగుళాల HD ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించింది. అలాగే, ఇది ఒక 1.4 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల క్వాడ్  కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసరుకు జతగా, 1GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజి తో వస్తుంది.అలాగే, ఒక డేడికేటెడ్ SD కార్డు సహాయంతో 32GB వరకూ మేమెవరిని పెంచుకోవచ్చు. అధనంగా, Android 9 Pie (Go Edition) OS తో లాంచ్ చేశారు. ఇది గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ తో వస్తుంది మరియు గ్రేడియం బ్లూ, సి బ్లూ మరియు గ్రేడియంట్ పర్పల్ వాటి మూడు ముచ్చటైన తంగుల ఎంపికలతో వస్తుంది.  

ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది ఒక 5MP సింగిల్ రియర్ కేమేరా మరియు ఫ్లాష్ తో అందించబడింది. ముందుభాగంలో సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఒక 3,020 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది మరియు ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తో సహా 12 భారతీయ భాషల సపోర్టుతో వస్తుంది. ఈ కెమేరా, మంచి ఫోతులను తీసుకునేందుకు వీలుగా Google Lens తో పాటుగా వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ 4G VoLTE/ViLTE సపోర్టుతో వస్తుంది.    

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile