iQOO Z9 5G vs Nothing Phone (2a) 5G: కొత్త ఫోన్స్ కంప్లీట్ కంపేరిజన్.!

HIGHLIGHTS

ఐకూ జెడ్ 9 మరియు నథింగ్ ఫోన్ (2a) మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాలు

20 నుండి 25 వేల బడ్జెట్ ధరలో కొత్తగా వచ్చిన ఫోన్ లు

iQOO Z9 5G vs Nothing Phone (2a) 5G కంప్లీట్ కంపేరిజన్

iQOO Z9 5G vs Nothing Phone (2a) 5G: కొత్త ఫోన్స్ కంప్లీట్ కంపేరిజన్.!

iQOO Z9 vs Nothing Phone (2a) 5G: భారత్ లో కొత్తగా విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఐకూ జెడ్ 9 మరియు నథింగ్ ఫోన్ (2a) మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాలు మరియు కంప్లీట్ కంపేరిజన్ ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా 20 నుండి 25 వేల బడ్జెట్ ధరలో కొత్తగా వచ్చిన ఫోన్ లు మరియు కొత్త ఫీచర్స్ తో వచ్చాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z9 vs Nothing Phone (2a) 5G: Price

ఐకూ జెడ్ 9 స్మార్ట్ ఫోన్ రూ. 19,999 ప్రారంభ ధరతో భారత్ మార్కెట్ లో విడుదలయ్యింది. నథింగ్ ఫోన్ (2a) రూ. 23,999 ప్రారంభ ధరతో విడుదల అయ్యింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా మంచి ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చాయి.

Display

ఐకూ జెడ్ 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మరియు HDR ప్లేబ్యాక్ సపోర్ట్ తో కలిగి వుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే సెన్సార్ తో కలిగి వుంది.

Processor

ఐకూ జెడ్ 9 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రోసెసర్ Dimensity 7200 శక్తితో పని చేస్తుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ మిడ్ రేంజ్ ప్రోసెసర్ Dimensity 7200 Pro శక్తితో పని చేస్తుంది.

RAM & Storage

ఈ రెండు లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు కూడా 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ నుండి ప్రారంభమవుతాయి. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ మాత్రం 12 GB RAM వేరియంట్ ను కూడా కలిగి వుంది.

Also Read: POCO X6 Neo 5G vs Nothing Phone (2a) 5G: కంప్లీట్ కంపేరిజన్.!

Camera

ఐకూ జెడ్ 9 స్మార్ట్ ఫోన్ 108MP (Sony IMX882) OIS + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో వస్తుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమేరాలతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా 4K Video రికార్డింగ్ సపోయేట్ ను కలిగి ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టం

ఐకూ జెడ్ 9 స్మార్ట్ ఫోన్ FunTouch OS 14 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS పైన చేస్తుంది. నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ కూడా Nothing OS 2.5 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన పని చేస్తుంది.

Battery & Power

ఈ రెండు లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లు కూడా 5000 mAh బిగ్ బ్యాటరీతో వచ్చాయి. వీటిలో, ఐకూ జెడ్ 9 ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తే, నథింగ్ ఫోన్ (2a) ఫోన్ మాత్రం 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo