బడ్జెట్ ధరలో 64MP OIS కెమేరాతో వచ్చిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G సేల్ మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 20 వేల సబ్ కేటగిరిలో ఈ స్మార్ట్ ఫోన్ 64MP OIS కెమేరా కలిగిన ఫోన్ గా వచ్చింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లేని ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడా కలిగివుంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారి కోసం మంచి ఆఫర్లను కూడా కంపెనీ లాంచ్ అఫర్ లో భాగంగా ప్రకటించింది.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Z7 5G: ధర&ఆఫర్లు
iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB బేసిక్ వేరియంట్ ను రూ.18,999 ధరతో మరియు 8GB ర్యామ్ మరియు 128 స్టోరేజ్ వేరియంట్ ను రూ.19,999 ధరతో ప్రకటించింది. SBI డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు HDFC కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ ఐకూ జెడ్ 7 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.38 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 8GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 సపోర్ట్ కూడా వుంది.
ఈ లేటెస్ట్ ఐకూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ డ్యూయల్ కెమెరాలో 64MP (OIS+EIS) సపోర్ట్ కలిగిన ప్రధాన కెమెరాకి జతగా 2MP బొకే కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,500mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 13 OS ఆధారిత Funtouch OS 13 పైన పనిచేస్తుంది.