అమెజాన్ నుండి iQOO Z6 Pro పైన మంచి డిస్కౌంట్ అఫర్ అందుకోండి..!!
iQOO Z6 Pro అమెజాన్ నుండి ఈ నెల చివరి వరకూ మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తుంది
ఈ ఫోన్ ను అఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు
ఈ ఫోన్ పైన 2,000 రుపాయల డిస్కౌంట్ పొందవచ్చు
iQOO Z6 Pro అమెజాన్ నుండి ఈ నెల చివరి వరకూ మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 778G 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పాటుగా HDR 10+ సర్టిఫికేషన్ కలిగిన AMOLED డిస్ప్లే వంటి గొప్ప ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ను అఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫోన్ పైనప్రకటించిన ఆఫర్లు, ఫోన్ ధర మరియు స్పెక్స్ వంటి పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.
SurveyiQOO Z6 Pro: ధర మరియు ఆఫర్
ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను రూ.23,999 రూపాయల ధరతో ప్రకటించింది. అలాగే, 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.28,999 గా ప్రకటించింది.
iQOO Z6 Pro: ఆఫర్లు
అమెజాన్ ఈ ఫోన్ మంచి బ్యాంక్ అఫర్ ను ప్రకటించింది. ఈ ఫోన్ పైన అన్ని బ్యాంక్ కార్డ్స్ (డెబిట్/క్రెడిట్) 2,000 రూపాయల డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అంటే, మీరు ఈ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన 2000 రుపాయల డిస్కౌంట్ పొందవచ్చన్న మాట. Buy From Here
iQOO Z6 Pro: స్పెక్స్
ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 2100 mm² వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile