iQOO Z6 : భారీ ఆఫర్లతో మొదటిసారి అమ్మకానికి వస్తున్న ఐకూ బడ్జెట్ 5G ఫోన్..!!
iQOO కంపెనీ ఇటీవలే ఐకూ Z6 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
iQOO Z6 మార్చి 22న మొదటిసారిగా సేల్ కి వస్తోంది
ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది
iQOO కంపెనీ ఇటీవలే ఐకూ Z6 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Z సిరీస్ నుండి వచ్చిన బడ్జెట్ 5G స్నార్ట్ ఫోన్ మరియు మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది. ఈ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ఎల్లుండి అనగా మార్చి 22న మొదటిసారిగా సేల్ కి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 2,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నుండి అందుబాటులో ఉంటుంది.
SurveyiQOO Z6: ధర
ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను కేవలం రూ.15,999 రూపాయల ధరతో ప్రకటించింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. మరొక రెండు వేరియంట్స్ కూడా వున్నాయి. ఇందులో 6GB+128GB వేరియంట్ ధర రూ.16,999 మరియు 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999. ఈ స్మార్ట్ ఫోన్స్ మార్చి 22 నుండి Amazon ద్వారా అమ్మకానికి వస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ లను HDFC బ్యాండ్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీలపై కొనేవారికి 2000 తగ్గింపు అఫర్ కూడా ప్రకటించింది.
iQOO Z6: స్పెక్స్
ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 1445 mm² 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.