iQOO Z11 Lite complete features revealed and expected price leaked online
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO Z11 Lite మరో రెండు రోజుల్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ని కంపెనీ ముందే వెల్లడించింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెక్స్ మరియు ఫీచర్స్ మీరు తెలుసుకోవచ్చు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ని మాత్రం కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, ఆన్లైన్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ప్రైస్ లీక్ అయ్యింది.
ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ సోలార్ ఫ్రేమ్ మరియు మిడ్ నైట్ బ్లూ అనే రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఎండలో కూడా చక్కగా కనిపించే 1200 నిట్స్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ సెగ్మెంట్ ప్రైస్ లో ఇది బ్రైటెస్ట్ డిస్ప్లే ఫోన్ అవుతుందని ఐకూ తెలిపింది.
ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ అయిన Dimensity 6300 SoC తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ తో జతగా 6GB ఫిజికల్, 6GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ 5.79,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఇది లేటెస్ట్ Origin OS 6 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. అలాగే, ఈ ఫోన్ 2 సంవత్సరాల మేజర్ OS అప్గ్రేడ్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లను అందుకుంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ Ai UHD, ఏఐ ఎరేజర్ వంటి మరిన్ని ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ తో వస్తుంది. ఇది కాకుండా ఇందులో బైపాస్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో ఒక ప్రత్యేకమైన డైనమిక్ లైట్ కూడా ఉంది. ఇది ఫోన్ కెమెరా పక్కన ఉంటుంది. ఇది అనేక రంగుల్లో వెలుగుతుంది మరియు ఇది నోటిఫికేషన్ లైట్.
Also Read: Vivo T5 Lite vs Realme Narzo 100x: రేపు ఫస్ట్ సేల్ కాబోతున్న ఈ ఫోన్లలో ఏది కొనాలి.!
ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ రూ. 11,999 నుంచి రూ. 12,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఇటీవల ఇండియాలో విడుదలైన స్మార్ట్ ఫోన్ ప్రైస్ ను బట్టి చూస్తే, ఈ ఫోన్ రూ. 16,999 నుంచి రూ. 18,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.