iQOO Z11 Lite 5G: బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ తో ఆకట్టుకునే ప్రైస్ తో వచ్చింది.!

HIGHLIGHTS

iQOO Z11 Lite 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ తో ఆకట్టుకునే ప్రైస్ తో వచ్చింది

ఐకూ జెడ్ 11 లైట్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది

iQOO Z11 Lite 5G: స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ తో ఆకట్టుకునే ప్రైస్ తో వచ్చింది. ఈ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని బ్యాటరీ మరియు అదనపు ర్యామ్ వంటి ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఐకూ ఈరోజు లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం.

iQOO Z11 Lite 5G: ప్రైస్

ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పియా గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా ఐకూ అందించింది. ఈ ఫోన్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • ఐకూ జెడ్ 11 లైట్ ( 4GB + 128GB) ప్రైస్ : రూ. 19,499
  • ఐకూ జెడ్ 11 లైట్ ( 4GB + 128GB) ప్రైస్ : రూ. 21,499
  • ఐకూ జెడ్ 11 లైట్ ( 4GB + 128GB) ప్రైస్ : రూ. 24,499

ఆఫర్స్

ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా ఐకూ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Axis మరియు SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్, ఐకూ అఫీషియల్ సైట్ మరియు వివో ప్రత్యేకమైన స్టోర్స్ నుంచి లభిస్తుంది.

Also Read : Lava Virat V1 5G: అతి చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

iQOO Z11 Lite 5G: ఫీచర్స్

ఐకూ జెడ్ 11 లైట్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన 6.74 ఇంచ్ LCD స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు 260 PPI వంటి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రాసెసర్ తో జతగా 6GB ఫిజికల్ ర్యామ్, 6GB వర్చువల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony మెయిన్ కెమెరా కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ నైట్ మోడ్, స్లో మోషన్ మరియు లైవ్ ఫోటో తో పాటు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో 6500 mAh భారీ బ్యాటరీ తో పాటు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో మరొక ప్రత్యేకమైన సెటప్ వుంది. అదే, డైనమిక్ లైట్ మరియు ఇది మల్టీ కలర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :