iQOO Z11 Lite 5G first sale starts on tomorrow know the sale offers and deals
ఐకూ సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ iQOO Z11 Lite 5G మొదటిసారి సేల్ కి అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం కంపెనీ గొప్ప ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు Sony కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ఆఫర్స్ మరియు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
ఐకూ ఈ ఫోన్ అండర్ రూ. 20,000 ప్రైస్ తో పరిచయం చేసింది. ఈ ఫోన్ బేసిక్ ఐకూ జెడ్ 11 లైట్ బేసిక్ ( 4GB + 128GB) వేరియంట్ రూ. 19,499 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అలాగే, ఐకూ జెడ్ 11 లైట్ మిడ్ ( 6GB + 128GB) వేరియంట్ రూ. 21,499 ధరతో మరియు హై ఎండ్ ( 6GB + 256GB) వేరియంట్ ను రూ. 24,499 ధరతో లాంచ్ చేసింది.
ఐకూ ఈ లేటెస్ట్ ఫోన్ పై ఆకట్టుకునే ఆఫర్లు కూడా లాంచ్ లో భాగంగా అనౌన్స్ చేసింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను Axis మరియు SBI CARD ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ నేరుగా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై 3 నెలల No Cost EMI ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐకూ అఫీషియల్ సైట్ మరియు రిటైల్ షాప్ లో లభిస్తుంది.
Also Read : Flipkart Freedom Sale కంటే ముందే బిగ్ డీల్ రిలీజ్ .. కేవలం 4 వేలకే 5.1 సౌండ్ బార్ అందుకోండి.!
ఐకూ జెడ్ 11 లైట్ ఫోన్ HD+ రిజల్యూషన్ 6.74 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. మీడియాటెక్ Dimensity 6300 5G ప్రాసెసర్ తో ఐకూ ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో పాటు భారీ 256GB స్టోరేజ్ కూడా అందించింది.
ఈ లేటెస్ట్ ఐకూ ఫోన్ 50MP Sony ప్రధాన సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ లైట్ ఈ ఫోన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది నోటిఫికేషన్ లైట్ మరియు మల్టీ కలర్స్ మరియు మల్టీ స్పీడ్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో 6500 mAh భారీ బ్యాటరీని అందించిన ఐకూ, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కూడా జత చేసింది. ఈ ఫోన్ లో మరొక ప్రత్యేకమైన సెటప్ వుంది. అదే, మరియు ఇది మల్టీ కలర్ తో వస్తుంది.