భారీ ఆఫర్స్ తో మొదలైన iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ సేల్.!

HIGHLIGHTS

iQOO Neo 10 సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది

ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,999 ప్రారంభ ధరకే లభిస్తుంది

ఈ ఐకూ కొత్త ఫోన్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది

భారీ ఆఫర్స్ తో మొదలైన iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ సేల్.!

ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 10 సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది మరియు ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోన్ సేల్ మరియు ఆఫర్స్ పూర్తిగా తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Neo 10 : ప్రైస్ మరియు ఆఫర్లు

ఈ ఐకూ కొత్త ఫోన్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ నాలుగు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

(8GB RAM, 128GB) వేరియంట్ ధర : రూ. 31,999

(8GB RAM, 256GB) వేరియంట్ ధర : రూ. 33,999

(12GB RAM, 256GB) వేరియంట్ ధర : రూ. 35,999

(16GB RAM, 512GB) వేరియంట్ ధర : రూ. 40,999

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా మరియు ఐకూ అధికారిక సైట్ నుంచి పొందవచ్చు. ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్ మరియు టైటానియం క్రోమ్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

iQOO Neo 10 Offers
iQOO Neo 10 Offers

ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ కార్డ్స్ తో రూ. 2,000 డిస్కౌంట్ లేదా రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ వంటి అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Infinix GT 30 Pro: గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ మరియు సెటప్ తో లాంచ్ అయ్యింది.!

iQOO Neo 10 : ఫీచర్స్

ఈ ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ 2.42 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగిన Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 16GB ర్యామ్ మరియు 512GB వారికి స్టోరేజ్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 144 FPS రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన AMOLED ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డిస్ప్లే కోసం ప్రత్యేకమైన Q1 సూపర్ కంప్యూటింగ్ సెట్ కూడా కలిగి ఉంటుంది.

iQOO Neo 10 Features

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 50MP సోనీ OIS ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో రికార్డింగ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo