iQOO Neo 10 డ్యూయల్ చిప్ పవర్ మరియు సూపర్ ఛార్జ్ ఫీచర్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

iQOO Neo 10 లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ అనౌన్స్ చేసింది

డ్యూయల్ చిప్ పవర్ మరియు సూపర్ ఛార్జ్ ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ టీజింగ్ చేస్తోంది

టీజర్ ఇమేజ్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.

iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ చిప్ పవర్ మరియు సూపర్ ఛార్జ్ ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ తో లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజింగ్ ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ వివరాలు తెలుసుకోండి.

iQOO Neo 10 : లాంచ్

ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మే 26వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు వెల్లడించింది.

iQOO Neo 10 : ఫీచర్స్

ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ చిప్ పవర్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ మరియు జతగా ఐకూ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ 8s Gen 4 చిప్ సెట్ 24 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుందని ఐకూ తెలిపింది. ఈ వేగవంతమైన చిప్ సెట్ తో గొప్ప గేమింగ్ కోసం Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ మరింత వేగంగా పని చేయడానికి వీలుగా LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ రెండిటి కలయిక తో ఈ ఫోన్ సూపర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కోడోత్ ఐకూ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో గొప్ప గేమింగ్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన గొప్ప డిస్ప్లే కలిగి ఉంటుందని టీజర్ ద్వారా వెల్లడించింది.

Also Read: Realme GT 7T గ్లోబల్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వివరాలు కోడోత్ ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ ను 120Hz ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్టు కూడా ఐకూ పేర్కొంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద కూలింగ్ వేపర్ ఛాంబర్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :