lava launches Lava Bold N4 Pro 5G under 15k budget price
Lava Bold N4 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లావా ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో బిగ్ 6000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మొబైల్ ఫోన్ ధరలో ఆకాశాన్ని అంటుతుండగా, లావా మాత్రం చాలా చవక ధరలో కొత్త ఫోన్ లను చాలా వేగంగా లాంచ్ చేస్తోంది. లావా ఈ రోజు సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరంగా చూద్దాం.
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 14,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,00 డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ ఈ ఫోన్ కేవలం రూ. 13,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ నుండి సేల్ చేస్తుంది. ఈ ఫోన్ మొనాకో బ్లూ ఒపులెంట్ లీలాక్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది.
లావా బోల్డ్ ఎన్ 4 ప్రో స్మార్ట్ ఫోన్ ని స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను 6.75 ఇంచ్ LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వసుంది. ఇది స్మూత్ విజువల్స్ అండ్ స్మూత్ గేమింగ్ అందిస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Unisoc T8200 చిప్ సెట్ తో పని చేస్తుంది.
ఇది 5 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. జతగా 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 12GB ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.