iqoo announced big deal on iQOO 15R from iqoo anniversary sale
ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఐకూ విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఐకూ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఐకూ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేల్ ను ప్రకటించింది మరియు ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది.
ఐకూ 6వ వార్షికోత్సవం సేల్ ను అమెజాన్ ఇండియా నుంచి అనౌన్స్ చేసింది మరియు ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఐకూ స్మార్ట్ ఫోన్ పై HDFC, ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్లాట్ రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 40,998 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ సేల్ ను అమెజాన్ ఇండియా ద్వారా అందించింది మరియు ఈ ఫోన్ కూడా అమెజాన్ ద్వారా లభిస్తుంది. iQOO 15R
ఈ ఐకూ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ జతగా 512GB స్టోరేజ్ తో వస్తుంద. ఈ ఫోన్ Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ను కూడా కలిగి ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP (Sony LYT-700V) మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని అందించింది. సూపర్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ తో కూడా వస్తుంది.
Also Read: OnePlus Nord 6: మిడ్ రేంజ్ బీస్ట్ గా విడుదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్.!
బ్యాటరీ పరంగా, ఈ ఐకూ లేటెస్ట్ ఫోన్ 7600mAh బిగ్ బ్యాటరీతో వచ్చింది. అంతేకాదు, 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో అడ్వాన్స్డ్ డ్యూయల్ స్పీకర్ మరియు Dolby Atmos సపోర్ట్ కూడా ఉంది. ఇది IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా నిలిచింది.