IQOO 7 5G: ఆ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్

IQOO 7 5G: ఆ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

IQOOరెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

300Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే

పిక్సెల్ షిఫ్ట్ అనే కొత్త ఫీచర్ ను కూడా జతచేసింది

ఈరోజు ఇండియాలో IQOO తన IQOO 7 సిరీస్ నుండి IQOO 7 5G మరియు IQOO 7 LEGEND అనే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో, IQOO 7 5G స్టార్టింగ్ వేరియంట్ మరియు ఈ సిరీస్ ఫోన్లలో తక్కువ ధరలో వుంటుంది. అయితే, ఈ ఫోన్ డ్యూయల్ చిప్ టెక్నాలజీతో ప్రకటించబడింది. ఈ టెక్నలాజితో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా IQOO 7 5G నిలుస్తుంది. ఇదొక్కటే కాదు  ఇంకా చాలా ఫీచర్లు ఈ ఫోన్ ను ఔరా! అనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందామా..!

IQOO 7 5G : ధర

IQOO 7 5G (8జీబీ + 128 జీబీ ) : రూ.31,990

IQOO 7 5G (8జీబీ + 256 జీబీ ) : రూ.33,990

IQOO 7 5G (12జీబీ + 256 జీబీ ) : రూ.35,990

IQOO 7 5G: ప్రత్యేకతలు

IQOO 7 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.62 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 300Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ డిస్ప్లే ఇప్పటి వరకూ ఏ స్మార్ట్ ఫోన్ కు లేని విధంగా ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ తో వస్తుంది మరియు గరిష్టంగా 1300 నైట్స్ బ్రైట్నెస్ అందించగలదు.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది Funtouch OS 11.1 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే కోసం అధనపు చిప్ సెట్ తో అవస్తుంది. ఈ విధంగా వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా IQOO 7 5G నిలుస్తుంది.  

ఇక కెమెరాల విషయంలో, IQOO 7 5G వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. కానీ, క్వాడ్ కెమెరా లాగా పనిచేస్తుంది మరియు ఈ కెమెరాలు అద్భుతమైన పనితనాన్ని అందించగలవు. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP SonyIMX598 సెన్సార్ ని OIS  ఫీచర్ తో  f/1.8 అపర్చర్ తో అందించింది. అంటే, ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 13MP అల్ట్రా-వైడ్ & మ్యాక్రో కెమెరా మరియు 2MP మోనో సెన్సార్ లను జతచేసింది. ఇందులో, పిక్సెల్ షిఫ్ట్ అనే కొత్త ఫీచర్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.  

IQOO 7 5G డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Hi-Res సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ 4,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 66W ఫ్లాష్  ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ ను  0% నుండి 100% నింపడానికి కేవలం 30 నిముషాల సమయం మాత్రమే తీసుకుంటుందని IQOO తెలిపింది.                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo