విడుదలకు ముందే లీకైన IQOO 3 5G స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెషిఫికేషన్లు

విడుదలకు ముందే లీకైన IQOO 3 5G స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెషిఫికేషన్లు
HIGHLIGHTS

LPDDR5 ర్యామ్, UFS 3.1 ROM ని అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందరికంటే ముందుగా ఇండియాలో 5G స్మార్ట్ ఫోన్ను ప్రకటించిన IQOO సంస్థ తన 5G స్మార్ట్ ఫోన్ అయినటువంటి IQOO 3 5G స్మార్ట్ ఫోన్ను ఈ నెల 25 వ తేదికి విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను చేయగా, ప్రస్తుతం ఈ విడుదల కంటే ముందుగానే ఈ ఫోన్ యొక్క అన్ని స్పెషిఫికేషన్లు కూడా లీకయ్యాయి మరియు కొన్ని అధికారికంగా ప్రకటించబడ్డాయి.

ట్విట్టర్ ద్వారా లీకైన ఇమేజిల ద్వారా ఈ ఫోన్ యొక్క పూర్తి సృషిఫెషన్లు విడుదల కంటే ముందుగానే తెలిసిపోయాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ లీక్ కి సంబంధించిన లీక్ ఇమేజిలు ట్విట్టరులో షేర్ అవుతున్నాయి. ఇక విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్,క్వాల్కమ్ యొక్క సరికొత్త వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ , 5G సపోర్ట్ తో పాటుగా మల్టి టర్బో అల్ట్రా గేమింగ్ మోడ్ మరిన్ని వంటి గొప్ప ప్రత్యేకతలతో రానున్నట్లు అర్ధమవుతోంది.

ఇక దీని కెమేరాల విషయానికి వస్తే, ఇందులో 48MP AI క్వాడ్ కెమేరాని మరియు ముందు పంచ్హోల్ డిజనులో సింగిల్ సెల్ఫీ కెమెరాని అఫర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక డిస్ప్లేవిషయానికి వస్తే , ఇది 180Hz  టచ్ రెస్పాన్స్ రేటు గల పోలార్ వ్యూ డిస్ప్లే అదికూడా E3 సూపర్ AMOLED డిస్ప్లేని మాస్టర్ టచ్ బటన్స్ తో తీసుకొస్తోంది. అదనంగా, LPDDR5 ర్యామ్, UFS 3.1 ROM ని అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, గేమింగ్ కోసం ప్రత్యేకంగా 4D గేమ్ వైబ్రేషన్ కూడా ఇందులో ఇచ్చినట్లు చూపిస్తున్నారు.                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo