iQOO 15 Pre Book: భారీ ఆఫర్స్ తో ఐకూ కొత్త ఫోన్ ప్రీ బుకింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది.!
iQOO 15 Pre Book ను రేపటి నుంచి అధికారికంగా ప్రారంభిస్తుంది
ప్రీ-బుకింగ్‌ను ముందుగానే ఓపెన్ చేసి, వినియోగదారులకు ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తోంది
ఈ ఫోన్ పై వరుసగా టీజర్లు విడుదల చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేసింది
iQOO 15 Pre Book : ఐకూ తన లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ iQOO 15 కోసం ముందస్తు బుకింగ్‌ను రేపటి నుంచి అధికారికంగా ప్రారంభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ, కంపెనీ ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌ను ముందుగానే ఓపెన్ చేసి, వినియోగదారులకు ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తోంది. గత కొన్ని రోజులుగా కంపెనీ ఈ ఫోన్ పై వరుసగా టీజర్లు విడుదల చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టుగా ఈ ఫోన్ ప్రీ బుకింగ్ కూడా ముందగా ఓపెన్ చేస్తోంది.
SurveyiQOO 15 Pre Book: ఆఫర్స్
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ ముందస్తు బుకింగ్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని చూసే యూజర్లు ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవడం ద్వారా అందరి కంటే ముందు ఈ ఫోన్ ను అందుకోవచ్చు. అంతేకాదు, ప్రీ బుక్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్ పై భారీ ఆఫర్లు కూడా అందుకోవచ్చు. ఈ ఫోన్ ను కేవలం రూ. 1,000 రూపాయలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకునే యూజర్లకు గొప్ప ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీ బుక్ తో ప్రియారిటీ పాస్ అందిస్తుంది. దీంతో రూ. 1,000 రూపాయల కూపన్ బెనిఫిట్ అందుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ పై 12 నెలల అదనపు వారంటీ, ప్రత్యేకమైన లాంచ్ డే ఆఫర్స్ మరియు రూ. 1,899 రూపాయల విలువైన ఐకూ TWS బడ్స్ కూడా ఉచితంగా అందిస్తుంది.
iQOO 15 Pre Book: ఎలా చేయాలి?
ఈ ఫోన్ ను రేపు ప్రీ బుక్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ఈ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఐకూ అందించిన Pre Book ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి మరియు రూ. 1,000 రూపాయలు చెల్లించి Checkout తో ప్రొసీడ్ అవ్వాలి. దీనికోసం ముందుగా APay wallet లో ఈ అమౌంట్ ను యాడ్ చేసుకోవాలి. ఈ పేమెంట్ ఆప్షన్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రీ బుక్ అయిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఐకూ 15 ప్రోడక్ట్ పేజీ ని చెక్ చేయండి.
Also Read: Ray-Ban Meta Smart Glasses సూపర్ AI కళ్ళ జోడు ఇండియాలో లాంచ్ అవుతోంది.!
ప్రీ బుక్ ఫోన్ ఎలా కొనాలి?
ఈ ఫోన్ ను ముందస్తు బుక్ చేసుకున్న యూజర్లు ఈ ఫోన్ ను కొనడానికి నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 11:59 గంటల లోపు అమెజాన్ లో లాగిన్ అయ్యి, ఈ ఫోన్ ను కార్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రీ బుక్ ఆఫర్ లో భాగంగా అందించిన ఉచిత బడ్స్ మరియు ఇతర ఆఫర్స్ యాడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకుని కొనడానికి ఉపక్రమించండి. అంతే, మీ పేమెంట్ ఆప్షన్ ఎంచుకొని ఈ ఫోన్ కొనుగోలు పూర్తి చేయండి.