iPhone Ultra leaked videos going viral on x platform is that real iphone
iPhone Ultra: చాలా రోజులుగా ఐఫోన్ ప్రేమికులు ఎదురు చూస్తున్న యాపిల్ బిగ్ ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్ డేట్ దగ్గరకు వచ్చింది. ఈ ఈవెంట్ నుంచి కొత్త సిరీస్ ఫోన్లు, వేరబుల్, ఎయిర్ పాడ్స్ లాంచ్ చేయడం చాలా కాలంగా సాగుతూ వస్తోంది. అయితే, ఈసారి ఒక కొత్త ఫోన్ ను యాపిల్ పరిచయం చేయవచ్చనే మాట ఇప్పుడు గాలి కంటే వేగంగా వ్యాపిస్తోంది. అదే, ఐఫోన్ అల్ట్రా లేదా ఐఫోన్ ఫోల్డ్ ఫోన్ అని చెబుతున్నారు. వాస్తవానికి, ఈ ఫోన్ గురించి యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, నెట్టింట్లో మాత్రం ఈ ఫోన్ పై చాలా రచ్చ జరుగుతోంది. ఇది నిన్నటి వరకు జరిగిన తంతు కాగా, ఈరోజు ఈ ఫోన్ అని చెబుతూ చాలా వీడియోలు X (గతంలో ట్విట్టర్) లో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X (గతంలో ట్విట్టర్) లో యాపిల్ ఐఫోన్ అల్ట్రా మరియు ఐఫోన్ ఫోల్డ్ ఫోన్ పేరుతో ఇప్పుడు అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది యాపిల్ చేయనున్న ఫోల్డ్ ఫోన్ గా అకౌంట్ హ్యాండీలర్లు చెబుతున్నారు. ఇది లీక్ వీడియో అని చెబుతూ ఈ వీడియోలు అని సూచిస్తూ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు x ప్లేట్ ఫేమ్ లో ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూ మరియు వీడియో కూడా ఇదే.
వాస్తవానికి, యాపిల్ ఇంతవరకు తన అప్ కమింగ్ ప్రొడక్ట్స్ గురించి ఎప్పుడు కూడా లీక్స్ లేదా వివరాలు అందించడం జతగా లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా తన అప్ కమింగ్ ఫీచర్స్ ని గోప్యంగా ఉంచుతుంది. అయితే, ఈ వీడియోలు చూడటానికి యాపిల్ లాంచ్ చేసే ఫోన్ అని నమ్మించే విధంగా ఉండటం విశేషం. అయితే, ఈ వీడియోల పైన కానీ ఈ అప్ కమింగ్ ఫోన్ పైన కానీ యాపిల్ ఇంత వరకు ఎటువంటి వివరాలు అఫీషియల్ గా ఇవ్వలేదు.
X ప్లాట్ ఫామ్ లో ఐఫోన్ అల్ట్రా ఫోన్ గా చెబుతూ చాలా అకౌంట్ ల నుంచి వీడియోలు దర్శనమిచ్చాయి. ఇందులో క్రీజ్ లెస్ ఫోల్డబుల్ డిజన్ తో ఉన్నట్లు మరియు ఈ డిజైన్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అని కూడా చెబుతున్నారు. ఇదే కాదు ఇందులో ఫేస్ ఐడి లేదని కొందరు చెబుతుంటే ఇది శాంసంగ్ ఫోల్డ్ ఫోన్ ను కాపీ కొట్టినట్లు ఉంటుందని మరి కొందరు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోలు నిజం అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే, యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 2026 రేపు రాత్రి జరుగుతుంది కాబట్టి, ప్రస్తుతం నెట్టింట్లో మరియు సోషల్ మీడియాలో నడుస్తున్న ఐఫోన్ అల్ట్రా రూమర్లు, లీక్డ్ వీడియో మరియు అంచనా స్పెక్స్ పై నిజా నిజాలు రేపు తెలుస్తాయి.
Also Read: Apple Event September 2026: డేట్, ఇండియాలో లైవ్ ఎలా చూడాలి మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి.!
ఆన్లైన్ లో ఉన్న అనేక రూమర్లు మరియు లీక్డ్ న్యూస్ ద్వారా ఈ ఫోన్ బుక్ ఫోల్డ్ డిజైన్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో 5.5 ఇంచ్ అవుటర్ స్క్రీన్ మరియు 7.8 ఇంచ్ మడతపెట్టే మెయిన్ స్క్రీన్ ఉంటాయని లీక్స్ లో తెలిపారు. ఈ ఫోన్ కూడా యాపిల్ ఐఫోన్ 18 ప్రో మరియు ప్రో మాక్స్ తో పాటు యాపిల్ A20 Pro చిప్ తో లాంచ్ అవకాశం ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు.
అలాగే, వెనుక 48MP మరియు 48MP రెండు పవర్ ఫుల్ సేనార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 24MP సెల్ఫీ కెమెరా ఆశించవచ్చని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి.
మరి యాపిల్ ఈ ఐఫోన్ అల్ట్రా ఫోన్ ను లాంచ్ చేస్తుందో లేదో మరియు ఒకవేళ లాంచ్ చేస్తే ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది, అనే ప్రశ్నలకు సమాధానం రేపు లాంచ్ ఈవెంట్ లో దొరుకుంటుంది. రేపు అఫీషియల్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.
గమనిక : ఈ న్యూస్ లో అందించిన ఇమేజ్ లు కేవలం కల్పితం మాత్రమే అని గమనించాలి. ఇది ఐఫోన్ అల్ట్రా లేదా మరింకే ఐఫోన్ కి సంబంధించిన ఇమేజ్ కాదు.