Apple Event September 2026: డేట్, ఇండియాలో లైవ్ ఎలా చూడాలి మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి.!
కొత్త డివైజ్ లను విడుదల చేయడానికి యాపిల్ లాంచ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసింది
Apple Event September 2026 యాపిల్ నిర్వహించే ఈ అతి పెద్ద ఈవెంట్
ఈ అతి పెద్ద ఈవెంట్ నుంచి కొత్త డివైజెస్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది
Apple Event September 2026: కొత్త డివైజ్ లను విడుదల చేయడానికి యాపిల్ లాంచ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసింది. సంవత్సరానికి ఒకసారి యాపిల్ నిర్వహించే ఈ అతి పెద్ద ఈవెంట్ నుంచి కొత్త డివైజెస్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఇదే విధంగా కొత్త డివైజ్ లను విడుదల చేయడానికి యాపిల్ ఈ బిగ్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేసింది. యాపిల్ నిర్వహించనున్న ఈ ఈవెంట్ డేట్, ఇండియాలో లైవ్ ఎలా చూడాలి, ఈ ఈవెంట్ నుంచి ఏమి ఆశించవచ్చు మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి.
SurveyApple Event September 2026: డేట్ అండ్ టైం
యాపిల్ నిర్వహించనున్న ఈ అప్ కమింగ్ ఈవెంట్ సెప్టెంబర్ 9వ తేదీ అనగా రేపు జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్ ని కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్ లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్ లో నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం 10:00 AM పసిఫిక్ టైమ్ (PT), అంటే యుఎస్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

Apple Event September 2026: ఇండియాలో లైవ్ ఎలా చూడాలి
యాపిల్ ఈవెంట్ 2026 కార్యక్రమాన్ని ఇండియాలో కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమం యాపిల్ టీవీ యాప్, యాపిల్ ఈవెంట్ పేజీ మరియు యాపిల్ అఫిషియల్ యూ ట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీరు లైవ్ చూడవచ్చు.
ఈ ఈవెంట్ నుండి ఏమి ఆశించవచ్చు?
ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి ఈసారి అంచనాలకు మించి కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఈవెంట్ నుంచి ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు లాంచ్ చేస్తుంది. అయితే, గత రెండు సంవత్సరాలుగా యాపిల్ ప్రేమికులు ఎదురు చూస్తున్న యాపిల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉందని భారీగా అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఈ ఈవెంట్ పేరును కూడా ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ గా ప్రకటించడం కూడా ఇది నమ్మడానికి దారితీసేలా ఉంది.
ఇప్పటికే ఈ అప్ కమింగ్ ఫోన్ చుట్టూ చాలా అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ తో మార్కెట్లో ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఈ ఫోన్ ను యాపిల్ ఐఫోన్ అల్ట్రా గా లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని చాలా ఘాడంగా నమ్ముతున్నారు. అయితే, ఈ ఫోన్ లాంచ్ గురించి ఇంకా ఎటువంటి అఫిషియల్ డీటెయిల్స్ లీక్ లేదు రివీల్ కాలేదు.
ఐఫోన్ 18 సిరీస్
ఈ సిరీస్ నుంచి యాపిల్ ఐఫోన్ 18 ప్రో మరియు ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లను ఇప్పటి వరకు మొబైల్ మార్కెట్ చూడని అత్యంత వేగవంతమైన Apple A20 Pro చిప్ సెట్ తో లాంచ్ అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 2nm ప్రాసెస్ టెక్నాలజీ పై నడుస్తుందని మరియు మార్కెట్ చూడని సరికొత్త స్కోర్ అందించే అవకాశం కూడా ఉండవచ్చని మార్కెట్ లో ఊహాగానాలు నడుస్తున్నాయి.
Also Read: స్ట్రీట్ మొత్తం షేక్ చేసే 11.2.4 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్ .. ప్రైస్ ఎంతంటే.!
యాపిల్ వాచ్ సిరీస్ 12
ఈ బిగ్ ఈవెంట్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 12 లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది గత సిరీస్ కంటే మరింత అడ్వాన్డ్స్ ఫీచర్ మరియు గొప్ప డిజైన్ కలిగి ఉండే అవకాశం ఉందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఆఫ్ కోర్స్, ఇవి లీక్స్ మాత్రమే అఫీషియల్ లాంచ్ తర్వాత ఈ వాచ్ ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటుందో తెలుస్తుంది.
యాపిల్ వాచ్ 4
యాపిల్ ప్రీమియం వేరబుల్ ని ఈ కొత్త లాంచ్ ఈవెంట్ నుంచి అందించే అవకాశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ 4 చుట్టూ చాలా రూమర్లు మరియు లీక్స్ నడుస్తున్నాయి. ఇది వేగవంతమైన మరియు మరింత స్మార్ట్ పనులు చేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే కాదు మరింత ఉన్నతమైన సెన్సార్, మరింత మెరుగైన ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉండవచ్చు.
AirPod 5
యాపిల్ ఇదే ఈవెంట్ నుంచి ఎయిర్ పాడ్ 5 కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది గత ఎయిర్ పాడ్స్ కంటే మరింత అడ్వాన్స్ ఫీచర్స్ మరియు అధిక ప్లే టైం అందించే బ్యాటరీ కలిగి ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి.
మొత్తానికి, రేపు జరగబోతున్న యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 2026 నుంచి గత సిరీస్ డివైజెస్ అప్‌గ్రేడ్ డివైజెస్ తో పాటు కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
