iPhone 16 Pro Price Drop: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఐఫోన్ 16 ప్రో.!
ఐఫోన్ 16 ప్రో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరలో సేల్ అవుతోంది
ఈరోజు నుంచి ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ తో ఈ ఐఫోన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
iPhone 16 Pro Price Drop: ఈరోజు నుంచి ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఐఫోన్ 16 ప్రో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు గొప్ప అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ ను మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.
SurveyiPhone 16 Pro Price Drop : ఎంత తగ్గింది?
ఐఫోన్ 16 ప్రో బేసిక్ వేరియంట్ ఇండియాలో రూ. 1,19,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి రూ. 94,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై మరో రెండు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఐఫోన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

మొదటిది SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో ఈ ఫోన్ తీసుకునే వారికి రూ. 2,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. రెండవది ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ద్వారా తీసుకునే వారికి మోడల్ ను బట్టి రూ. 5,000 వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. ఈ రెండు ఆఫర్స్ తో యూజర్లు దాదాపు రూ. 7,500 వరకు అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ. 87,499 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే రూ. 32,401 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Also Read: Amazon Sale నుంచి చవక ధరలో లభిస్తున్న Lloyd మరియు Voltas స్ప్లిట్ ఏసీలు.!
Apple iPhone 16 Pro : ఫీచర్స్
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది రిచ్ అండ్ లైఫ్ లైక్ కలర్స్ అందిస్తుంది మరియు చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ A18 Pro Chip తో పని చేస్తుంది మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో డైనమిక్ ఐల్యాండ్ మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఓలీయోఫోబిక్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ లో వెనుక 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రా వైడ్ మరియు 12MP (5x టెలిఫోటో జూమ్) ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు స్టన్నింగ్ ఆపిల్ ఫోటో ఫీచర్ మరియు ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వన్ డే బ్యాటరీ మరియు ఫాస్ట్ మెగ్ సేఫ్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం ఐఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో పొందే అవకాశం ఉంది.