యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ నుండి మొత్తం నాలుగు ఫోన్లను ఇండియాలో విడుదల చేసింది. ఇందులో ప్రీమియం ఫోన్లు అయిన ఐఫోన్ 14 ప్రో మరియు 14 ప్రో మ్యాక్స్ ఫోన్ల ధరలు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఎందుకంటే, ఈ ఫోన్ల హై ఎండ్ వేరియంట్ ధరలు దాదాపుగా అక్షరాల రెండు లాకారాల దాకా ఉంటుంది. అయితే, ఐఫోన్ పైన జనాలకు ఉన్న క్రేజ్ మనకు తెలియంది కాదు. గతంలో ఐఫోన్ ను కొనడానికి కొంత మంది ఎటువంటి పనులు చేశారో గతంలో వచ్చిన వార్తల ద్వారా మనం చూశాము. లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త ఐఫోన్ల ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 14 Pro Series: ధరలు
Apple iPhone 14 Pro: ధరలను పరిశీలిస్తే, యాపిల్ ఐఫోన్ 14 ప్రో రూ.1,29,900 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర. ఇక 256GB వేరియంట్ ధర 1,39,900 కాగా, 512GB ధర 1,59,900. చివరిగా, హై ఎండ్ వేరియంట్ 1 TB స్టోరేజ్ ధర 1,79,900 గా నిర్ణయించింది.
Apple iPhone 14 Pro Max: ఇక ప్రో మ్యాక్స్ ఫోన్ మోడల్స్ ధర విషయానికి వస్తే, రూ.1,39,900 నుండి ప్రారంభవుతుంది మరియు ఇది 128GB వేరియంట్ ధర. ఇక 256GB వేరియంట్ ధర 1,49,900 కాగా, 512GB ధర 1,69,900. చివరిగా, హై ఎండ్ వేరియంట్ 1 TB స్టోరేజ్ ధర 1,89,900 గా నిర్ణయించింది.
ఈ ఫోన్ల పైన EMI అప్షన్ ను కూడా యాపిల్ ఇండియా వెబ్సైట్ అఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 9 వ తేదీ నుండి ఈ ఫోన్ల యొక్క ప్రీ ఆర్డర్స్ మొదలవుతాయని యాపిల్ తెలిపింది.