200MP కెమెరా 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో భారీ స్మార్ట్ ఫోన్ లాంచ్..!
Infinix Zero Ultra 5G భారీ ఫీచర్లతో లాంచ్
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా స్మార్ట్ ఫోన్ 3D AMOLED డిస్ప్లేతో వచ్చింది
200MP కెమెరా 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్
ప్రముఖ మొబైల్ కంపెనీ Infinix ఇప్పటి వరకూ కూడా దాదాపుగా బడ్జెట్ ధరల చుట్టూనే తన స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ పైన కూడా కన్నేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, 200MP కెమెరా 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో భారీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. Infinix Zero Ultra 5G పేరుతొ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అన్ని విభాగాల్లో కూడా భారీ స్పెక్స్ ను కలిగి వుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి.
SurveyInfinix Zero Ultra 5G: స్పెక్స్ మరియు ఫీచర్లు
ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 ఇంచ్ 3D AMOLED డిస్ప్లేతో వచ్చింది మరియు ఇది FHD+ డిస్ప్లేని సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను కూడా కలిగివుంది.
ఆప్టిక్స్ పరంగా, జీరో అల్ట్రా 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 200MP మైన్ కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ముందు పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో 4610 mAh బ్యాటరీని 180W థండర్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ కేవలం 12 నిముషాల్లోనే 0 నుండి 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
Fast charge done right. Blast your device to 100% in just 12 minutes with Furious Mode. ⚡#Infinix #InfinixZeroSeries #ExploreBeyond #InfinixZeroUltra pic.twitter.com/ct0PNAghaF
— Infinix Mobile (@Infinix_Mobile) October 7, 2022
Infinix Zero Ultra 5G: ధర మరియు సేల్
Infinix యొక్క ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ యొక్క 8GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర $ 520. అయితే, ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ ఎప్పటి వరకూ అవుతుందనే విషయం పైన కంపెనీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile