Infinix Smart 20: బిగ్ డిస్ప్లే మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ స్మార్ట్ సిరీస్ నుంచి ఇండియాలో కొత్త ఫోన్ స్మార్ట్ 20 లాంచ్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతోంది

ఈ ఫోన్ లాంచ్ కీలక ఫీచర్స్ తో ఇన్ఫినిక్స్ టీజింగ్ కూడా మొదలు పెట్టింది

Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ సిరీస్ నుంచి ఇండియాలో కొత్త ఫోన్ స్మార్ట్ 20 లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లే మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కీలక ఫీచర్స్ తో ఇన్ఫినిక్స్ టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అండ్ కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Infinix Smart 20: లాంచ్ డేట్?

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది.

Infinix Smart 20: కీలక ఫీచర్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ కేవలం 7.7mm అల్ట్రా స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం ఫోన్ లాగా కనిపించే డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G81 Ultimate ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్ ఫీచర్ మరియు 2TB వరకు విస్తరించి తగిన స్టోరేజ్ ఫీచర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఈ ఫోన్ లో ప్రత్యేకమైన డెడికేటెడ్ Ai బటన్ ఉంటుంది. ఇందులో స్మార్ట్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో కాలింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. అదేమిటంటే, అల్ట్రా లింక్ ఫీచర్ తో No SIM కాలింగ్ సౌలభ్యం అందుతుంది. ఈ ఫోన్ లో గొప్ప కాలింగ్ కోసం వాయిస్ ప్రింట్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Also Read: BSNL Telangana Special Offer: కేవలం రూ. 51 కే 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 5200 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ వరకు డ్రాప్ టెస్ట్ తట్టుకున్నట్లు క కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :