అత్యంత చవకయిన Pop Up సెల్ఫీ ఫోనుగా ఇన్ఫినిక్స్ S5 ప్రో

అత్యంత చవకయిన Pop Up సెల్ఫీ ఫోనుగా ఇన్ఫినిక్స్ S5 ప్రో

Infinix S5 Pro స్మార్ట్ ఫోన్ను పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో పాటుగా వెనుక 48MP ట్రిపుల్ కెమేరాతో కేవలం రూ.9,999 ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, అత్యంత చౌకధరలో విడుదలైన పాప్ అప్ సెల్ఫీ కెమేరా స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది. ఇదోక్కటే మాత్రమే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.  S5 Pro ఫోన్ యొక్క మొట్టమొదటి సేల్ మార్చ్ 13 తేదికి మద్యాహ్నం 12 గంటలకి జరగనుంది. 

Infinix S5 Pro: ధర

Infinix S5 Pro (4GB + 64GB) : ధర – Rs.9,999

ఈ ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో మాత్రమే విడుదల చెయ్యబడింది.

Infinix S5 Pro : ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.53 అంగుళాల పరిమాణం గల ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఇది FHD + రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్ప్లే కంటెంట్ చక్కగా వీక్షించే విధంగా ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది  2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక Mediatek Helio P35 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో గేమింగ్ కోసం కూడా ప్రత్యేకమైన గేమింగ్ మోడుతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో గల ఒకేఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఒక డేడికేటెడ్ మెమోరికార్డుతో 256GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఇది ఒక వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సేటప్పుతో వస్తుంది. ఇందులో ఒక ప్రధాన 48MP కెమేరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు మూడవ లో లైట్ సెన్సార్ సేతప్పుతో వస్తుంది. అయితే, ముందు భాగంలో మాత్రం, 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో చాలా ఫీచర్లను కూడా అందించింది. ఇక ఈ ఫోన్ మొత్తానికి శక్తిని అందించాడాని సరిపడా 4000mAh బ్యాటరీని ఇందులో ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo