16MP+2MP+ Low Light Camera మరియు పంచ్ హోల్ సెల్ఫీ ఫోన్ : ధర మాత్రం రూ.7,999, ఈరోజే సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Nov 22 2019
16MP+2MP+ Low Light Camera మరియు పంచ్ హోల్ సెల్ఫీ ఫోన్ : ధర మాత్రం రూ.7,999, ఈరోజే సేల్

HONOR smart bands

Track your fitness with HONOR Band 5

Click here to know more

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో, పంచ్ హోల్ సెల్ఫ్ మరియు ట్రిపుల్ కెమేరా కలిగిన వాటిలో ప్రధమంగా నిలుస్తుంది.

ఇన్ఫినిక్స్ సంస్థ, ఇండియాలో చాలా తక్కువ ధరలో Infinix S5 Lite స్మార్ట్ ఫోన్ను ఒక పంచ్ హోల్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమేరాతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ను కేవలం 7,999 రూపాయల ధరలతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో, పంచ్ హోల్ సెల్ఫ్ మరియు ట్రిపుల్ కెమేరా కలిగిన వాటిలో ప్రధమంగా నిలుస్తుంది. అటువంటి, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ నుండి జరగనుంది.     

Infinix S5 Lite ధర మరియు ఆఫర్లు

Infinix S5 Lite (4GB + 64GB ) - కేవలం రూ.7,999 మాత్రమే       

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్,  నవంబర్ 22 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఆఫర్ల విషయానికి వస్తే, HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అందుతుంది మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు &Axis బజ్ క్రెడిట్ కారుతో కొనేవారికి 5% డిస్కౌంట్ లభిస్తుంది.     

Infinix S5 Lite ప్రత్యేకతలు

ఈ Infinix S5 lite స్మార్ట్ ఫోన్  ఒక 6.6 అంగుళాల HD+ IPS పంచ్ హోల్ డిజైనుతో మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 480 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు , ఇది ఒక 20:9 ఆస్పెక్ట్ రేషియోని కలిగిన పెద్ద స్క్ర్రీనుతో వస్తుంది.  ఇక ఇందులో చాలా గొప్ప 3D యూనిబాడి డిజనుని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.5 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి సపోర్ట్ చేస్తుంది.

ఈ  Infinix S5 Lite కెమేరా ఉష్యానికి వస్తే,  వెనుకభాగంలో  ఒక ప్రధాన 16 మెగాపిక్సెల్ (f1.8) కెమేరాకి జతగా ఒక 2MP వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా మరొక Low Light సెన్సార్ తో జతగా కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 16-MP AI కెమెరాని  కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుక్వజల్ షాన్, మిడ్నైట్ బ్లాక్ మరియు పర్పల్ వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.             

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.