నెలకు రూ.291 కే ఈ ఫోన్ మీ సొంతం!! ఈరోజే మొదటి సేల్!!
హాట్ 10 ప్లే నో కాస్ట్ EMI తో కూడా కొనుగోలు
చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.
హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్
గత వారంలో లేటెస్ట్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఇండియాలో విడుదల చేసిన హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలయ్యింది. ఈ ఫోన్ పైన చాలా ఆఫర్లను కూడా అందించింది మరియు హాట్ 10 ప్లే నో కాస్ట్ EMI తో కూడా కొనుగోలు చెయవచ్చు. అయితే, స్టాండర్డ్ EMI తో కొనాలనుకునే వారికీ నెలకు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.
Surveyఈ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ ను అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డుతో EMI పైన కొనుగోలు చెయ్యవచ్చు. అయితే, Flipkart Axis Bank EMI ప్లాన్ నుండి కేవలం అన్నింటి కంటే తక్కువ EMI తో కొనవచ్చు. ఇక ఇతర బ్యాంకుల EMI విషయానికి వస్తే, బ్యాంక్ వడ్డీ మరియు ఇన్స్టాల్ మెంట్ నెలలను బట్టి 409 లేదా 413 రూపాయల ప్రారంభ EMI తో కూడా పొందవచ్చు.
Infinix Hot 10 Play : ధర
ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ( 4GB + 64GB ) కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క ధర Rs. 8,499 రూపాయలు. ఈ ఫోన్ ఈరోజు నుండి Flipkart ,లో అందుబాటులో వుంది.
Infinix Hot 10 Play : స్పెషిఫికేషన్లు
Hot 10 Play స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 అంగుళాల డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే, HD రిజల్యూషన్ వస్తుంది మరియు 90.6% స్క్రీన్-టూ- రేషియో కలిగి గరిష్టంగా 440 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. అంటే, ఈ స్క్రీన్ పెద్దగా ఉండడమే కాకుండా ఎక్కువ బ్రైట్నెస్ ని కూడా ఇవ్వగలదు. ఈ ఫోన్ MediaTek Helio G35 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది మంచి ఎక్కువ పవర్ ఎఫిషియన్సీ అందించగల గేమింగ్ ప్రొసెసర్. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మైక్రో SD కార్డు సహాయంతో 256GB వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయంలో, హాట్ 10 ప్లే వెనుక AI డ్యూయల్ కెమెరా సేతప్పుతో వస్తుంది. ఇందులో, 13MP మైన్ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ వున్నాయి. దీనితో, స్లో మోషన్ వీడియోలు, బొకే ఎఫక్ట్ ఫోటోలతో పాటుగా AI HDR ఫోటోలను కూడా తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. అలాగే, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్లాష్ కూడా ఉన్నాయి. ఆడియో పరంగా, DTS Surround Sound సపోర్ట్ తో వుంటుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీతో వస్తుంది.