కేవలం రూ.6,999 ధరకే 4GBర్యామ్, 64GB స్టోరేజీతో ఈరోజు లాంచ్ కానున్న Infinix Hot 8 స్మార్ట్ ఫోన్
మార్కెట్లో లభించనున్న అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.
ప్రస్తుతం, ప్రతి ఒక్క మొబైల్ తయారీ కంపెనీ కూడా మంచి స్పెక్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరలకే అందిస్తున్నాయి. అయితే, Infinix సంస్థ ఈ రోజు తన Hot 8 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చెయ్యడానికి డేట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.6,999 ధరకే లాంచ్ చేయనున్నట్లు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఫోన్ గురించి ముందుగా ఫ్లిప్కార్ట్ లో అందించిన టీజింగ్ ద్వారా ఇది 4GBర్యామ్, 64GB స్టోరేజీతో ఉండనున్నట్లు ప్రకటించింది. ఇదే గనునకు నిజమైతే, ఇటువంటి స్పెక్స్ మరియు ర్యామ్ మరియు స్టోరేజితో మార్కెట్లో లభించనున్న అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.
Surveyఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ flipkart ద్వారా అమ్ముడవనున్నది. అందుకే, flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన దీనికి సంబంచిన స్పెక్స్ వివరాలను చూపిస్తోంది. దీని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 6 అంగుళాల కంటే పెద్దదైన డిస్ప్లేతో ఉండనుంది మరియు ఈ డిస్ప్లే ఒక డ్యూ డ్రాప్ నోచ్ డిజైనుతో ఉంటుంది. ఇక ఇందులో బ్యాటరీ కూడా 4,000mAh కంటే పీడడిగా ఉండనున్నట్లు చెబుతోంది.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ఒక పెద్ద ప్రాధాన కెమేరాతో కూడిన ట్రిపుల్ (3) వెనుక కెమేరా సెటప్ ఇవ్వనునట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోనులో ఒక సూపర్ సెల్ఫీ కెమేరాని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ను ఒక మంచి ప్రాసెసరుకు జతగా 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో ఇవ్వనున్నట్లు చెప్పడం నిజంగా హర్షణీయం గా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంచ్ చేయనుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
