Infinix HOT 60i 5G: 9వేల బడ్జెట్ ధరలో AI సపోర్ట్ మరియు బెస్ట్ డిజైన్ తో వచ్చింది.!
Infinix HOT 60i 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది
కేవలం 9,000 రూపాయల బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది
ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో వచ్చింది
Infinix HOT 60i 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 9,000 రూపాయల బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే ఈ ఫోన్ కేవలం 9000 రూపాయలు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసుకొని తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyInfinix HOT 60i 5G: ప్రైస్
ఇన్ఫినిక్స్ హాట్ 60ఐ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,299 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ కేవలం సింగల్ వేరియంట్ లో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ మాన్సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, షాడో బ్లూ మరియు స్లీక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Sony Dolby Atmos Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!
Infinix HOT 60i 5G: ఫీచర్స్
ఈ ఫోన్ చాల ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకునే డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.75 ఇంచ్ IPS స్క్రీన్ ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు సన్నని అంచులు కలిగి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 5G ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు ఇందులో 4GB ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పై రాం అవుతుంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AIGC పోర్ట్రైట్ మోడీ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ తో AI Eraser, AI Extender, Voice Search, AI కాల్ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 6000 mAh బిగ్ బ్యాటరీ అందించింది. ఈ ఫోన్ డీటీస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
