First Sale: రేపు మొదటిసారిగా సేల్ కి రానున్న కొత్త బడ్జెట్ 16GB RAM స్మార్ట్ ఫోన్.!
Infinix HOT 40i స్మార్ట్ ఫోన్ మొదటి సేల్
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ భారీ లాంఛ్ ఆఫర్ కూడా లభిస్తుంది
లాంఛ్ ఆఫర్లతో రూ. 8,999 రూపాయలకే అందుకోవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది
First Sale: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందిస్తున్న బ్రాండ్ గా యూజర్ల మెప్పు పొందిన Infinix రీసెంట్ గా ఇండియాలో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. అదే, Infinix HOT 40i స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ రేపు మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలువుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10,000 రూపాయల ధరలో 16 GB RAM ఫీచర్ మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఆకట్టుకుంటుంది.
SurveyInfinix HOT 40i First Sale
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 21 వ తేదీ, అంటే రేపు మధ్యాహ్నం నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 9,999 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ను మొదటి సేల్ నుండి లాంఛ్ ఆఫర్లతో రూ. 8,999 రూపాయలకే అందుకోవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది.

పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేసే వారికి రూ. 1,000 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను పొందడం ద్వారా ఈ ఆఫర్ ధరతో ఫోన్ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ అను అందుకునే వీలుంది.
Also Read : Gold Rate Live: మెల్లగా పుంజుకుంటున్న గోల్డ్ మార్కెట్.!
Infinix HOT 40i Specs
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ Unisoc T606 ఆక్టా ప్రోసెసర్ జత 8GB RAM + 8GB Extended RAM ఫీచర్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించగలదని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ లో గొప్ప ర్యామ్ ఫీచర్ తో పాటుగా 256 GB హెవీ స్టోరేజ్ కూడా వుంది. ఈ ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన పంచ్ హోల్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రియం ఫోన్ లలో కనిపించే మాదిరి మ్యాజిక్ రింగ్ ఫీచర్ కూడా వుంది.

ఈ ఫోన్ లో 50MP + AI Lens డ్యూయల్ రియర్ కెమేరా మరియు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ XOS 13 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో పని చేస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile