ఫ్లిప్ కార్ట్ నుండి భారీ ఆఫర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో సేల్.!

HIGHLIGHTS

Infinix Hot 12 Pro ఫ్లిప్ కార్ట్ నుండి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది

అతితక్కువ ధరలో గొప్ప ర్యామ్ మరియు అధిక వర్చువల్ ర్యామ్ ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది

ఫ్లిప్ కార్ట్ నుండి భారీ ఆఫర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో సేల్.!

ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన Infinix Hot 12 Pro ఫ్లిప్ కార్ట్ నుండి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో గొప్ప ర్యామ్ మరియు అధిక వర్చువల్ ర్యామ్ ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ అతితక్కువ ధరలో బిగ్ ర్యామ్ మరియు 90Hz డిస్ప్లేతో వచ్చింది.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Hot 12 Pro: ధర మరియు సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB + 64GB) ధర కేవలం రూ.10,999 కాగా (8GB + 128GB) వేరియంట్ ధర రూ.11,999 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్ ఆగష్టు 8 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ను ICICI మరియు Kotak కార్డ్స్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ అఫర్ తో బేసిక్ వేరియంట్ ను  కేవలం రూ.9,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు.

Infinix Hot 12 Pro: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T616 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జతచేసింది.

కెమెరా విషయానికి వస్తే, హాట్ 12 ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo