అతితక్కువ ధరలో 8GB ర్యామ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
అతితక్కువ ధరలో 8GB ర్యామ్ ఫోన్
ఇప్పుడు భారీ ఆఫర్లతో మరింత చవక ధరకే లభిస్తోంది
8GB హెవీ ర్యామ్ మాత్రమే కాదు జతగా 5GB వర్చువల్ ర్యామ్ కూడా వుంది
అతితక్కువ ధరలో 8GB ర్యామ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల ఇన్ఫినిక్స్ 8GB ర్యామ్ తో అతితక్కువ ధరలో తీసుకొచ్చిన ఫోన్ Infinix Hot 12 Pro ఇప్పుడు భారీ ఆఫర్లతో మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 8GB హెవీ ర్యామ్ మాత్రమే కాదు జతగా 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది. కాబట్టి, మీ మల్టీ టాస్కింగ్ మరింత స్మూత్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఆఫర్ల వివరాలను ఆలశ్యం చెయ్యకుండా చూసేద్దామా.
SurveyInfinix Hot 12 Pro: ధర మరియు ఆఫర్లు
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB + 64GB) ధర కేవలం రూ.10,999 కాగా (8GB + 128GB) వేరియంట్ ధర రూ.11,999 రూపాయలు మాత్రమే.ఈ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతోంది మరియు ఈ ఫోన్ ను Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Bank Of Baroda బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా తక్కువలో తక్కువ ధరకే 8GB ర్యామ్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
Infinix Hot 12 Pro: స్పెక్స్ మరియు ఫీచర్లు
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T616 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జతచేసింది.
కెమెరా విషయానికి వస్తే, హాట్ 12 ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile