Infinix Hot 11 2022: కేవలం 8,999 ధరలో బిగ్ FHD డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో వచ్చింది..!!

Infinix Hot 11 2022: కేవలం 8,999 ధరలో బిగ్ FHD డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీతో వచ్చింది..!!
HIGHLIGHTS

infinix ఈరోజు ఇండియాలో Infinix Hot 11 2022 ను విడుదల చేసింది

కేవలం 8,999 రూపాయల ధరలో పెద్ద FHD+ డిస్ప్లే ఫోన్

4GB RAM మరియు 64GB స్టోరేజ్

infinix ఈరోజు ఇండియాలో Infinix Hot 11 2022 ను విడుదల చేసింది. ఈ ఫోన్ కేవలం 8,999 రూపాయల ధరలో పెద్ద FHD+ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ తో ఉండడమే కాకుండా ఈ ధరలో కంప్లీట్ ప్యాకేజ్ గా వచ్చింది. అంతేకాదు, 9 వేల రూపాయల ధరలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీగా కూడా నిలుస్తుంది. ఈ లేటెస్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందామా.   

Infinix Hot 11 2022:   ధర

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్  ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 21 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Hot 11 2022: స్పెక్స్

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల FHD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియా Unisoc T610 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది  4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. అలాగే, ఇది XOS  10 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

కెమెరాల పరంగా, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11 202 వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 13MP సెన్సార్ తో అందించింది.  జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు LED ఫ్లాష్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, 8MP AI సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని టైప్ C సపోర్ట్ తో కలిగివుంటుంది.  ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo