Xioami నుండి ఈ నెలలో రిలీజ్ కానున్న Mi Max మరియు Mi band 2 ఇమేజెస్ లీక్

Xioami నుండి ఈ నెలలో రిలీజ్ కానున్న Mi Max మరియు Mi band 2 ఇమేజెస్ లీక్

Xiaomi చైనాలో Mi మాక్స్ స్మార్ట్ ఫోన్ మరియు Mi బాండ్ 2 ను రిలీజ్ చేయనుంది May 10 న. ఈ లోపల వీటి ఇమేజెస్ leak అయ్యాయి చైనీస్ వెబ్ సైట్ Weibo లో.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇమేజెస్ ప్రకారం మాక్స్ ఫోన్ కు మెటాలిక్ ఫ్రేమింగ్ మరియు క్రింద 3 కేపాసిటివ్ టచ్ బటన్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్. ఇక Mi బ్యాండ్ 2 విషయానికి వస్తే…

ఇది silicon strap తో వస్తున్నట్లు ఉంది. ఇంకా సెపరేట్ dongle కూడా ఉంది. డిజైన్ మాత్రం ప్రివియస్ Mi బ్యాండ్ వలె ఉంది.  దీనికి ఈ సారి డిస్ప్లే ఉంది. ప్రివియస్ బ్యాండ్ కు డిస్ప్లే లేదు, కేవలం LED లైట్స్ మాత్రమే ఉన్నాయి.

ఈ విషయం కంపెని సీఈఓ బ్యాండ్ వేసుకొని తీసుకున్న ఫోటో ద్వారా తెలిసింది. Mobipicker రిపోర్ట్స్ ప్రకారం..Mi బ్యాండ్ 2 సుమారు 1000 రూ ఉంటుంది. 

Mi మాక్స్ ఫోన్ విషయానికి వస్తే దీనిలో.. 6.4 in డిస్ప్లే ఉంది. గిక్ బెంచ్ లో లిస్టు అయిన రిపోర్ట్స్ ప్రకారం అయితే దీనిలో స్నాప్ డ్రాగన్ 617 SoC, 3GB ర్యామ్ ఉన్నాయి.

GFXBench లిస్టింగ్ మాత్రం దీనిలో స్నాప్ డ్రాగన్ 650 SoC మరియు 2GB ర్యామ్ ఉంటాయని తెలిపాయి. ఇంకా FHD డిస్ప్లే, 16MP అండ్ 5MP కేమేరాస్ ఉంటాయని రిపోర్ట్స్.

ఈ రెండు డివైజెస్ తో పాటు కంపెని MIUI 8 ను కూడా May 10 న రిలీజ్ చేయనుంది చైనాలోని Bejing లో.

 

 

Writer, gamer, and hater of public transport. View Full Profile