అమెజాన్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న నోకియా 4.2 స్మార్ట్ ఫోన్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Jan 2020
అమెజాన్ నుండి సగం ధరకే అమ్ముడవుతున్న నోకియా 4.2 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది.

Advertisements

Access Open Source Technology

Innovate w/ IBM and Discover New Open Source Technology Today. Learn More.

Click here to know more

HMD గ్లోబల్ ఇండియాలోని బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి, నోకియా 4.2 స్మార్ట్ ఫోన్, ఇప్పుడు అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020 నుండి ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్, నోకియా నుండి వచ్చిన మొట్టమొదటి వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోనుగా కూడా ప్రసిద్ధిపొందింది. ముఖ్యంగా, ఈ ఫోనులో అందించిన ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ ఈ స్మార్ట్ ఫోన్ను ఆకట్టుకునేలా చేస్తుంది.

ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ను రూ.10,999 రూపాయల ధరట్లో ఇండియాలో అమ్ముడు చేశారు. అయితే, అమేజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పైన గరిష్టంగా 5,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.5,999 ధరకే అమ్మడుచేస్తోంది.      

నోకియా 4.2 ప్రత్యేకతలు

ఈ నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 720 x 1520 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.71 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఈ డిస్ప్లేని ఒక U ఆకారంలో వున్న నోచ్ డిజైన్ తో అందించారు మరియు ఈ నోచ్ లో సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది. ఇది 3GB ర్యామ్ కి జతగా  32GB స్టోరేజితో లభిస్తుంది.  అలాగే, మైక్రో SD కార్డుతో 400GB వరకు మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలుంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, f/2.2 అపర్చరు  కలిగిన ఒక 13MP ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP ( f/2.2) డెప్త్ కెమేరాతో, డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు. ముందుభాగంలో, ఒక 8MP కెమేరాని f /2.0 అపర్చరుతో అందించారు. అయితే, ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది. ఇందులో 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని అందించింది. ఇది Android 9 Pie OS పైన నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి అప్డేట్లను త్వరగా అందుకుంటుంది.

logo
Raja Pullagura

Tags:
nokia 42
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status